– సీఎం సభలంటే బెంబేలెత్తుతున్న ప్రజలు
– మాజీ శాసనసమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు
ఒకప్పుడు ముఖ్యమంత్రులు బహిరంగ సభలు పెడితే ఏం చెబుతారా అని ప్రజలు తండోపతండాలుగా సభలకు వెళ్లి వినేవారు. కాని గత 5 ఏళ్లుగా అటువంటి పరిస్థితి లేదు. సీఎం సభ అంటే ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. సుధూర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లాలంటే బస్సులు లేక అగచాట్లు పడుతున్నారు.
కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బందితో ప్రజలు నరకం చూస్తున్నారు. మరో వైపు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు, విద్యా సంస్థల బస్సులు లాక్కొని ఇబ్బందులు పెడుతున్నారు. ఏ ప్రాంతంలో సీఎం సభలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లో ఉన్న విద్యా సంస్థల నుంచి సాక్షాత్తు అధికారులే చట్ట వ్యతిరేకంగా బలవంతంగా బస్సులు తీసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన యాజమాన్యంపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
ఇప్పటికే విద్యా వ్యవస్థను అస్థవ్యస్థం చేశారు. ఇప్పుడు వైసీపీ సభలు పెట్టి విద్యా సంస్థలకు సెలవులిస్తున్నారు. ఆఖరికి పరీక్షలను సైతం వాయిదా వేయిస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్ కన్నా వైసీపీ సభలే మిన్నా అన్నట్లు భావిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో వైసీపీ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా సభలకు రాకపోతే పథకాలు కట్ అవుతుందంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్ రెడ్డి సభల్లో ప్రజలు భయటకు వెళ్లిపోకుండా పోలీసులను కాపాలాపెట్టిస్తున్నారు.