– రాష్ట్రం లో తీవ్ర విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందంటూ చంద్రబాబు ట్వీట్.
– విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ వీడియోను జత చేసి ట్వీట్
– తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు: ట్వీట్ లో చంద్రబాబు
గ్రామాల్లో అనధికార పవర్ కట్ లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? నాడు మిగులు విద్యుత్ తో వెలుగులు నిండిన మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్ల కు కారణం ఎవరు? రాష్ట్రంలో అసలు కరెంట్ ఎందుకు పోతోంది.? భారీగా పెరిగిన బిల్లులు ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకు? ఓవైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక రోడ్డెక్కుతుంటే…. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని నీరో కాక ఇంకేమనాలి? విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని..సమస్యను పరిష్కరించాలి.