Suryaa.co.in

Telangana

కుటుంబ పార్టీలతో ప్రజలు విసిగి పోయారు: సంగప్ప

కేంద్ర ప్రభత్వ పథకాలు ప్రజలకు అందకుండా కేసీఆర్ అడ్డుపడ్డారు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆధ్వర్యంలో బిజెపిలోకి భారీగా చేరికలు

ఇప్పటివరకు కుటుంబ పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు బిజెపి పై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు.

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి కంగ్టీ మండలం దేగుల్వాడీ గ్రామం, నారాయణఖేడ్ మండలం పంచగామ నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్, బీఆరెస్ నుంచి యువకులు, రైతులు బిజెపి వైపు ఆకర్షితులు అవుతున్నారనీ ఆయన అన్నారు. సంగప్ప ఆధ్వర్యంలో గ్రామస్తులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సంగప్ప బిజెపి లోకి ఆహ్వానించారు.

మోడీ పాలనలో నారాయణఖేడ్ కు NH 161 జాతీయ రహదారి రావడం తో తమ ప్రాంత రూపురేఖలు కొంత వరకు మారాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా చేశారని సంగప్ప మండి పడ్డారు.

75 ఏళ్లలో నారాయణఖేడ్ కు ఒక్క ఫ్యాక్టరీ, కంపెనీ రాక పోవడం తో ఉపాధి లేక అక్కడి ప్రజలు వలసలు పోతున్నారని చెప్పారు. నారాయణఖేడ్ అభివృద్ధి కేవలం బిజెపి వల్ల మాత్రమే సాధ్యం అన్న భావన ప్రజల్లో వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఅరెస్ రెండు అవినీతి పార్టీలని ఆయన విమర్శించారు.

ఈ కార్యక్రమం లో పార్టీ నేతలు సాయిరాం, సగనాకర్, సతీష్, అశోక్ తో పాటు సతీష్ రెడ్డి (లడ్డు), నర్సింలు, విఠల్, వెంకటేష్, సంతు రెడ్డి, బాలాజీ, శిద్దారెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE