Suryaa.co.in

Telangana

తెలంగాణ గల్లీలకు వచ్చి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హామీలు ఇస్తున్నారు?

తెలంగాణ కు ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఇవ్వాళ ఇస్తారా?
గిరిజన యూనివర్సిటీ ని ఇప్పుడు ప్రకటిస్తారా?
బయ్యారం ఉక్కు మా హక్కు. ఆ ఫ్యాక్టరీ ఏమైంది?
ప్రధాని మోడీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

ఢిల్లీలో కూర్చుని తెలంగాణ ఏర్పాటును అవమానిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డని బతికించారు అంటున్నారు. మా బియ్యం కొనమంటే, నూకలు తినే అలవాటు మీ ప్రజలకు చేసు కోమని మీరు, మీ మంత్రులు అవమానించిన విషయం మరచిపోయారా? మరి తెలంగాణ గల్లీలకు వచ్చి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హామీలు ఇస్తున్నారు? సిగ్గు అనిపించడం లేదా?

కొత్తగా మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఉపాధి హామీ కూలీలకు అన్యాయం చేసి, ఉపాధి కల్పిస్తున్నామని మాయమాటలు చెప్పారు. తెలంగాణ కు ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఇవ్వాళ ఇస్తారా? ఏండ్ల కింద భూమిని కేటాయించినప్పటికీ, ఇవ్వని గిరిజన యూనివర్సిటీ ని ఇప్పుడు ప్రకటిస్తారా?భూమి కేటాయింపులు లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు భవనాల్లో గిరిజన యూనివర్సిటీ ని నడిపిస్తారా?

బయ్యారం ఉక్కు మా హక్కు. ఆ ఫ్యాక్టరీ ఏమైంది?!మాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మీరు తరలించకపోయి, డబ్బాలు కడిగే ప్రాజెక్టు మాకు ఇచ్చింది నిజం కాదా?! విభజన చట్టంలోనే ఇచ్చిన హామీలను విస్మరించారు. ఒక్కటైనా నెరవేర్చారా? మనుషుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ పని. మత చిచ్చులు పెట్టి మంట కాగడమే మీకు తెలిసింది.

మా పన్నులు మీ ఖజానాలో వేసుకొని మీరు మాకు ఇచ్చేదేంటి? రాష్ట్రంగా మా హక్కుల మాటేంటి? ఎన్నికలప్పుడే హామీలా? తొమ్మిది ఏండ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు చేసిన అవమానాలను మరచిపోలేదు. మీ జిమ్మిక్కులను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మీరేం చేసినా తెలంగాణలో ఊదు కాలదు పీరి లేవదు. రాష్ట్రంలో రేపటి అధికారం మళ్ళీ బి అర్ ఎస్ దే!

LEAVE A RESPONSE