Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పరపతి ఎంత పలచబడిందో తెలుస్తుంది

– ప్రజల కన్నా పచ్చ మీడియానే నమ్మే చంద్రబాబు నాయుడి డ్రామాలు జనం చూస్తున్నారు
– ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి

ప్రతిపక్షాలు అందరూ కలిస్తే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం అన్న చంద్రబాబు పిలుపు చూస్తేనే ప్రజల్లో ఆయన పరపతి ఎంతగా పలచబడి పోయిందో తెలుస్తోందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీలు కలసిరావాలని దీన్నే రాజకీయ పునరేకీకరణ అనే (పరువు తక్కువ) పేరుతో చంద్రబాబు పిలుస్తున్నడని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలొఇ ఎప్పుడో ఏదో చేశాననే కథలు చెప్పాడం తప్ప ఎన్నికలకు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి చంద్రబాబు అని చెప్పారు.

ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఎన్నికలకు వెళ్లడం సర్వత్రా ఉన్న పద్ధతి అని, పొత్తుల కోసం తెరవెనుక మంత్రాంగాలు నడిపే వ్యూహాలకు, జనం కేంద్రంగా లేని ఎత్తుగడలకు కాలం చెల్లిందని చెప్పారు. అబద్ధాన్ని వంద సార్లు చెప్పి ప్రజలను వంచించిన గోబెల్స్ సాయంతో జర్మనీని పన్నెండు ఏళ్లు ఏలిన హిట్లర్ యుద్ధంలో గెలిచాడా? చంద్రబాబుని ప్రశ్నించారు.

పచ్చ మీడియాకి ఎంత సేపూ చంద్రబాబు కోసం గంటలకొద్దీ సుత్తి కోట్టడం సరిపోతుందన్నారు.ఎల్లో మీడియా స్టూడియోలకు చంద్రబాబును వెళ్తే పూర్ణకుంభ స్వాగతాలు పలుకుతున్నరని ఎద్దేవా చేశారు. ప్రజలకన్నా పచ్చ మీడియానే నమ్మే చంద్రబాబు నాయుడి డ్రామాలు జనం చూస్తున్నారని చెప్పారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని ఎన్టీఆర్ చెప్పేవారని,కాని చంద్రబాబుకు మాత్రం పచ్చ మీడియానే దేవాలయం, వాటి అధిపతులే ప్రభువులు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షం, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించి, వారి ఆశీర్వాదం తీసుకునే గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న ప్రారంభం కానుందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి గడపకూ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు వెళ్లనున్నారని వెల్లడించారు.

LEAVE A RESPONSE