Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్ రెడ్డి అరెస్టు కాడేమో అని ప్రజల సందేహం

– నిన్నటిదాకా రాజారెడ్డి రాజ్యాంగం,నేడు భారతి రాజ్యాంగం
– మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట: భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం నిన్నటిదాకా రాజారెడ్డి రాజ్యాంగం,నేడు భారతి రాజ్యాంగం నడుస్తుంది.అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేస్తున్నాడు.అవినాష్ రెడ్డి అరెస్టు కాడేమో అని ప్రజల్లో సందేహం కలుగుతుంది. వివేకానంద రెడ్డి హత్య ఆస్తి కోసం కాదని కేవలం రాజకీయం కోసమే అని షర్మిల మాట్లాడింది అది చూసి జగన్ సిగ్గుపడాలి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీచర్లు పై కక్ష సాధిస్తున్నారు. వారిచేత అన్ని పనులు చేయించుకుంటూ వేసవి సెలవులు ఇవ్వకుండా వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మంత్రి రజిని అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు సభలకు జనం లేరని అంటున్నారు వాళ్ళకు కళ్ళు ఉన్నాయా లేక కళ్ళజోడు గాని పెట్టాలా? మీ పరిపాలన బాగుంటే ఇళ్లపై స్టిక్కర్లు ఎందుకు . పథకాలు రద్దు అవుతాయని ప్రజలు మీ స్టిక్కర్లు ఉంచుతున్నారు లేకపోతే వెంటనే పీకేస్తారు.

రైతుల గురించి ఆలోచించి వారి నష్టాలను కొంతమేర ఆదుకోవాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్య ఆస్తి కోసం కాదని కేవలం రాజకీయం కోసమే అని షర్మిల మాట్లాడింది అది చూసి జగన్ సిగ్గుపడాలి. వైసిపి ప్రభుత్వం లో బీసీలకు పదవులు మాత్రమే ఇచ్చారు, అవి అలంకారప్రాయమే. మంత్రులు పదవులు కాపాడుకోవడానికి టిడిపి పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.

LEAVE A RESPONSE