– వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధితులే: సోమిరెడ్డి
– ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పర్యటన
– పొదలకూరు పంచాయతీ చిట్టేపల్లిలో పర్యటనకు శ్రీకారం
– చిట్టేపల్లి, తోకంచిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటనకు విశేషస్పందన
– వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఏకరవుపెట్టిన ప్రజానీకం
– ప్రజావ్యతిరేక పాలనకు కాలం చెల్లిపోయే రోజు దగ్గరపడిందని, త్వరలోనే మంచి రోజులొస్తాయని ధైర్యం చెబుతూ ముందు సాగిన సోమిరెడ్డి
ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏమన్నారంటే.. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధితులే.పొదలకూరు మండలంలో ప్రధానంగా రెవెన్యూ శాఖ అవినీతికి, ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది.తహసీల్దారుగా పనిచేసిన స్వాతి ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడి ప్రభుత్వ భూములను కూడా కొందరికి దారాధత్తం చేసింది.అక్రమాలు జరిగాయని ఓ వైపు తహసీల్దారు, మరోవైపు జిల్లా కలెక్టరు
అంగీకరించినా ఈ రోజుకీ చర్యలు లేవు. చిల్లకూరులో అక్రమాలు బయటపడగానే తహసీల్దారుతో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు బనాయించారు. పొదలకూరు తహసీల్దారును మాత్రం సీసీఎల్ఏకు పంపారు..ఎమ్మెల్యే అండ ఉంటే ప్రత్యేక రక్షణ కల్పిస్తారా?
పొదలకూరు లో అక్రమాలు జరిగాయని జిల్లా కలెక్టరే ఒప్పుకున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటి? స్వాతి తర్వాత తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి నిజాయతీగా పనిచేస్తుంటే ఆమెను బదిలీ చేసేశారు. నిజాయతీగా పనిచేసే అధికారులను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండనీయరా? జనవరిలో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ వరకు తహసీల్దారులను బదిలీ చేయకూడదనే మార్గదర్శకాలనూ తుంగలో తొక్కారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు వణికిపోయే కలెక్టర్, ఎస్పీలు బదిలీల విషయంలో మాత్రం నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదు. తహసీల్దారు హోదాలో స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అప్పటి ఎస్సై బినామీ వ్యవహారం ఉన్నా చర్యలు తీసుకునే దమ్ము జిల్లా అధికారులకు లేకుండా పోవడం దురదృష్టకరం.