-వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది
-ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా?
-కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
-బీజేపీ కార్పొరేటర్లపై వివక్ష చూపిస్తున్నారు
-ప్రజలు ఓట్లేసి గెలిపించారనే విషయాన్ని మర్చిపోతున్నారా?
-ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు
-బండి సంజయ్ కుమార్ ఆగ్రహం
-టవర్ సర్కిల్ వద్ద స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించిన బండి సంజయ్
-సమస్యలను ఏకరవు పెట్టిన ప్రజలు
-పనుల నాణ్యతపైనా ఫిర్యాదులు
-అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై అసంత్రుప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్
-తీరు మార్చుకోవాలని హితవు
‘‘రాజకీయ విమర్శలు- ప్రతి విమర్శలకు తావులేకుండా కరీంనగర్ ను సమగ్రంగా అభివ్రుద్ధి చేయాలనే ఉద్దేశంతో మేం సహకరిస్తుంటే…మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా? అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు నిస్వార్ధంగా పనిచేస్తేనే అభివ్రుద్ధి సాధ్యమవుతుందనే విషయాన్న గుర్తుంచుకుని వ్యవహరించాలి. అభివ్రుద్ది పనుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద వికాస్ తీర్థ స్కీం కింద జరుగుతున్నస్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలు పలు ఫిర్యాదులు చేశారు. లైట్లు వెలగడం లేదని, వర్షం వస్తే నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయని, డ్రైనేజీ పొంగుతోందని వాపోయారు. పనులు సరిగా జరగడం లేదని, నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న అధికారులను పిలిచి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం, నాణ్యత లోపించడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు- ప్రతి విమర్శలకు తావులేకుండా కరీంనగర్ ను అభివ్రుద్ధి చేయాలనే ఉద్దేశంతో మేం సహకరిస్తుంటే…మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా?’’అని పేర్కొన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు నిస్వార్ధంగా పనిచేస్తేనే అభివ్రుద్ధి సాధ్యమవుతుందనే విషయాన్న గుర్తుంచుకుని వ్యవహరించాలని సూచించారు. అభివ్రుద్ది పనుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కార్పొరేటర్ల విషయంలో వివక్ష చూపుతోంది. నిధులివ్వడం లేదు. చాలా మంది అధికారులు కష్టపడి చేస్తున్నారు. కానీ కొందరు అధికారుల తీరు సరిగా లేదు. బీజేపీ కార్పోరేటర్లు ప్రజా పనుల కోసం వెళ్తే పట్టించుకోరు. ఏం తప్పు చేశారు వాళ్లు? ప్రజలు గెలిపిస్తేనే కదా కార్పొరేటర్లు అయ్యింది? ఎవరికి వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? నేను ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్ సహా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లిన. మరోసారి ఇట్లా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అంటూ మండిపడ్డారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులను కలవడం, కేంద్ర అభివ్రుద్ది పనులను పరిశీలించడం, వివిధ మోర్చాలతో సమావేశం నిర్వహించడం, మోదీ 9 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహజన్ సంపర్క్ అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే ఈరోజు టవర్ సర్కిల్ లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి పనులను పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించినట్లు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల అభివ్రుద్ధికి కేంద్రం నిధులిస్తోందన్నారు. అందులో భాగంగానే కరీంనగర్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీ పథకం కింద నిధులిస్తోందన్నారు. పనులు నాణ్యతతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.