రాజ్యసభ చర్చలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: స్వార్ధ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏనాటికీ క్షమించబోరని వైఎస్సార్సీపి సభ్యులు వి. విజయసాయి రెడ్డి విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదమే కారణం అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందుపరచి పార్లమెంట్ ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు హోదా చట్టబద్దంగా లభించి ఉండేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రణాళికా సంఘానికి పంపించడం వలనే హోదా అంశం చట్టబద్దతను కోల్పోయిందని విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు.