బాలశౌరి ఒక బఫూన్

– బాలశౌరి ముంచి పోయే తత్వం.. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే నో టికెట్
మంత్రి అంబటి రాంబాబు

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు.. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. సినిమా యాక్టర్ ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికి చంద్రబాబు ఉపన్యాసం చెబుతారంటా.

మా పార్టీలో టికెట్ లేని బఫూన్ లు వేరే పార్టీలో చేరతారు, ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్లి అక్కడ చేరాడు, కొద్దిగా ఓవర్ గా మాట్లాడాడు.. ఓవరాక్షన్ చేస్తేనే తప్ప అక్కడ గుర్తించమన్నట్టున్నారు. చాలా ప్రగల్భాలు పలికాడు.. చాలా ఓవరాక్షన్ చేశాడు. పవన్ కల్యాణ్ బాలశౌరిని ఉద్దేశించి.. ఇప్పటి వరకు అక్కడుండి ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు, వీడిని నమ్మొచ్చా అన్నాడు..

బాలశౌరి జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 2004 నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, తెనాలి పార్లమెంట్ లో పోటీ చేసిన దగ్గర నుంచి బాలశౌరి గురించి తెలుసు. బాలశౌరి పుట్టుక దగ్గర నుంచి నేటి వరకు అన్నీ తెలుసు. ఇక్కడ తంతే వెళ్ళి జనసేన ఆఫీస్ లో పడ్డాడు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేస్తే జనసేన ఆఫీసులో తేలాడు.

ఇప్పుడు జగన్ ని దూషించే కార్యక్రమం చేస్తున్నాడు. బాలశౌరిని నమ్మోచ్చా అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అనుకున్నారంటా. బాలశౌరిని ఎవరూ నమ్మరు.. ఎవరినైనా ముంచిపోయే తత్వమే బాలశౌరిది. గత్యంతరం లేక బందరు టికెట్ ఇవ్వొచ్చు ఏమో .. బాలశౌరిది ముంచిపోయే తత్వమని మనకన్నా నాదెండ్ల మనోహర్ కి, పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు, రాబోయే కాలంలో మీరే చూస్తారు.

Leave a Reply