Suryaa.co.in

Andhra Pradesh

ఎవరు శిక్షార్హులో ప్రజలే నిర్ణయించాలి

-ప్రజలు దాచుకున్న అభయ హస్తం సొమ్ము కొట్టేసిన ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలా?
-ఏ తప్పు చేయని మార్గదర్శిని శిక్షించాలా?అన్నది విజ్ఞులైన ప్రజలే తేల్చి చెప్పాలి
-తప్పు చేస్తున్న పోలీసు అధికారులే, రేపు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారు
-తప్పు చేపిస్తున్న జమోరె తనకేమి తెలియదని చెప్పి తప్పించుకుంటాడు
-గతంలో ఆయన తండ్రి హయాంలో కూడా ఇదే జరిగింది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఏ తప్పు చేయని మార్గదర్శి సంస్థ ను శిక్షించాలా?, అభయ హస్తం పథకం కింద ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకున్న ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలా?? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. అభయ హస్తం సొమ్మును కొట్టేసిన ఈ ప్రభుత్వం పై సీతారామాంజనేయులు సుమోటోగా కేసు నమోదు చేసి, దానికి కారకులైన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

మార్గదర్శి పై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అక్రమ దాడుల నుంచి సోమ, మంగళవారాలలో న్యాయస్థానాల నుండి ఆ సంస్థ కు ఊరట లభించే అవకాశం ఉంది. దాడుల పేరిట వెధవ వేషాలు వేస్తున్న అధికారులకు శృంగ భంగం తప్పదని రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు. ఆదివారం నాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్గదర్శిపై గతంలో రాష్ట్ర సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసు చార్జి షీట్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నో ఫర్దర్ యాక్షన్ అని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, న్యాయస్థానాల ఆదేశాలను తూనా బొడ్డు అన్నట్లుగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం రాక్షస మూకలాగా దాడులు చేస్తోంది.

ఈ ప్రభుత్వ పెద్దలను ఏమని సంబోధించాలో అర్థం కావడం లేదు. పిచ్చి, ఉన్మాదం అనే మాటలు వారికి చాల చిన్నవి అవుతాయి. ఒక నర్స్ మానసిక రుగ్మతతో ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చి ఏడు మంది చిన్నారులను చంపేసినట్లుగా, అటువంటి సైకిక్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తులే సిఐడి అధికారులతో ఇలా చేపిస్తున్నారన్న సందేహం కలుగుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

సైకిక్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తులు చేపిస్తున్నారు సరే… పోలీసు అధికారుల కైనా బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు.. పోలీసుల చర్యలను న్యాయస్థానం తప్పు పడితే రేపు పోయేది వారిఉద్యోగమేనన్న ఆయన, ఈ ప్రభుత్వమేమైనా శాశ్వతం అని వారు భావిస్తున్నారా?? అంటూ నిలదీశారు. మార్గదర్శిపై గత నాలుగు రోజులు నిరవధిక దాడులు నిర్వహిస్తూ, వివిధ సెక్షన్ల కింద 37 మార్గదర్శి శాఖల బ్రాంచ్ మేనేజర్లతో పాటు యజమానులైన రామోజీరావు, శైలజా కిరణ్ లపై నేరపూరిత కుట్ర, చీటింగ్ కేసులు నమోదు చేయాలని జమోరె, సీతారామాంజనేయులుకు దిశా నిర్దేశం చేయగా, ఆయన కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోందన్నారు.

కక్షతో రగిలిపోయే వ్యక్తులు, పరిపాలనకు అర్హులా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ప్రభుత్వమే నియంత్రించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వమే పోలీసు అధికారుల సహకారంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. మార్గదర్శి సంస్థ యజమానులైన రామోజీరావు, శైలజా కిరణ్ ను అరెస్టు చేస్తే, సీతారామాంజనేయులు కు డీజీపీ గా పదోన్నతి కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పదవి వ్యామోహంతో రాజేంద్రనాథ్ రెడ్డి స్థానం కోసం రామోజీరావు, శైలజాకిరణ్ లను సీతారామాంజనేయులు అరెస్టు చేస్తే ఆయన కు పదోన్నతి లభించవచ్చు. కానీ ఈ అరెస్టులు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయన్న బుద్ధి ఆయనకు లేదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ప్రభుత్వ సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి, జైల్లో వేయాలని న్యాయమూర్తులు ఆదేశిస్తే , ఏ న్యాయవాదులు కూడా ఈ పోలీసు అధికారులను కాపాడలేరు. ఈ దాడులకు ప్రోత్సహించిన ముఖ్యమంత్రి మాత్రం సురక్షితంగా ఉంటారు..

అధికారులు వారి విధులను వారు నిర్వహించారు. ఒకవేళ వారు తమ విధుల్లో తప్పు చేసి ఉంటే వారిని శిక్షించాలని చెప్పి తప్పించుకుంటాడని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. గతంలో ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎంతోమంది అధికారులు బలయ్యారు. వారి జీవితాలు సర్వనాశనమయ్యాయన్న విషయాన్ని, రాష్ట్రంలోని పోలీసు అధికారులు గుర్తిస్తే మంచిది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిగా కొనసాగుతున్న రామకృష్ణ, బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన రేపు వేరే చోటికి బదిలీపై వెళ్తారు.

బయట నుంచి వచ్చిన వ్యక్తులతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వెధవ పనులు చేయిస్తున్నారు. రాష్ట్ర ఐ పీ ఎస్ క్యాడర్ కు చెందిన సీతారామాంజనేయులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్నదే అంతుచిక్కడం లేదు. ఎవరైనా గీత దాటితే, దాని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీతారామాంజనేయులు లాంటి అధికారులు గుర్తించాలని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

మార్గదర్శి సంస్థ శాఖలు నిర్వహిస్తున్న భవనాల మున్సిపల్ అనుమతులు పరిశీలించడం, చందాదారులను బెదిరించి ఏదోరకంగా సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం పరిశీలిస్తే, అసలు కేసులలో పసలేదని అర్థమవుతుందన్నారు.

అభయ హస్తం పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేనే సూచించా…

2008 సంవత్సరం చివరిలో, 2009 సంవత్సరం మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకం పేరును ఆయనకు నేనే సూచించానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జీవిత బీమా పథకం కావడంతో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు కలిసి వచ్చేలా అభయ హస్తం అని పేరు పెడితే బాగుంటుందని చర్చల సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నేను సూచించగానే ఆయన అదే పేరు ఖరారు చేశారన్నారు .

అభయ హస్తం పథకం కింద ఎంతోమంది ప్రభుత్వానికి డబ్బులు చెల్లించారు. అభయ హస్తం పథకానికి మా ప్రభుత్వం హాండ్సప్ అనేసింది. ఈ పథకంలో చేరిన వారికి ప్రిన్సిపల్ అమౌంట్ వెనక్కి ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వకుండా ఈ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కొట్టేసింది. ఏ తప్పు చేయని మార్గదర్శి సంస్థపై 420, 406, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి ప్రజల డబ్బులు కొట్టేసిన ప్రభుత్వంపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు దాచుకున్న డబ్బులు వారికి వెనక్కి ఇవ్వకుండా, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని మార్గదర్శిపై ఇన్ని కేసులు పెడతారా దరిద్రులారా, దుర్మార్గులారా అని మండిపడుతున్న ప్రజలు మీపై ఎన్ని కేసులు పెట్టాలని మనల్ని నిలదీస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగమే, ప్రభుత్వ అధినేతగా చీఫ్ మినిస్టర్ కొనసాగుతారు కాబట్టి ఎవరిపై కేసులు పెట్టాలని నిలదీస్తున్నారన్నారు.

మనము నిబంధనలు ఉల్లంఘించవచ్చు… కానీ 40 ఏళ్ల కింద గృహ నిర్మాణం చేపట్టిన వారు అనుమతులు ఉల్లంఘించరాదా?

రాష్ట్రంలో ఎన్నో భవనాలలో బ్యాంకు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటన్నింటికీ అగ్నిమాపక దళ శాఖ అనుమతులు ఉన్నాయా?, ఎన్ని భవనాలు అగ్నిమాపక దళ శాఖ అనుమతులను ఉల్లంఘించాయని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, కేవలం మార్గదర్శి సంస్థ శాఖలను నిర్వహిస్తున్న భవనాలకు మాత్రమే అగ్నిమాపక దళ శాఖ అనుమతులు సవ్యంగా ఉండాలా అంటూ నిలదీశారు.

లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనంలో ఎన్నో ఉల్లంఘనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెండు వేర్వేరు నివాస సముదాయాలను నిర్మించుకున్నప్పుడు, ఇద్దరి భవనాల మధ్య ఐదేసి అడుగుల చొప్పున పది అడుగుల దూరం ఉండాలి కదా? ఉందా?? అంటూ ప్రశ్నించారు. మనం నిబంధనలను ఉల్లంఘిస్తే ఉల్లంఘించినట్టు కాదు. ఇతరులు మాత్రం 40 ఏళ్ల క్రితం నిర్మించుకున్న భవనంలో చిన్న చిన్న నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే, వారి భవనం నుంచి ఆఫీసు ఖాళీ చేయిస్తారా? ఇదెక్కడి న్యాయం… మన ఈ దమన కాండను ప్రజలు గమనిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

మన స్థానాలలో ప్రతిపక్షాలు గెలిచాయి

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మన పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన స్థానాలను , ప్రతిపక్ష పార్టీలు గెలుచుకున్నాయని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 22 స్థానాలలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే, ప్రతిపక్ష పార్టీలు 11 స్థానాలను గెలుచుకున్నాయి. మన పార్టీ హింసాత్మాక పద్ధతులను అవలంబించిన, దిక్కుమాలిన, పనికిమాలిన వాలంటీర్లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఇచ్చిన తీర్పుతో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మన పార్టీ సరదా తీరింది.

ఈ దుర్మార్గపు అరాచకంలోనూ ప్రతిపక్ష పార్టీలు 11 స్థానాలు గెలుచుకున్నాయంటే భవిష్యత్తులో మనకు బ్యాండ్ బాజా బారాతే నని స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను మా ఓటర్లు వేరే ఉన్నారని అన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాగే అంటారా?, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసిన అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చిందంట. అంటే అతనికి భార్యాపిల్లలు కూడా అతనికి ఓట్లు వేసినట్లు లేరు. రాబోయే రోజుల్లో మన పార్టీకి ఇదే పరిస్థితి ఎదురు కానుంది.

ఉభయగోదావరి జిల్లాల్లో ఫలితాలు మన పార్టీకి శరాఘాతంగానే ఉన్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి అరాచకాలను మానివేసి మంచిగా మారితే కాస్తో కూస్తో స్థానాలు రావచ్చు.. లేకపోతే ప్రజలు మనని సమాధి చేయడం ఖాయం. మార్గదర్శి సంస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులు రెండు రోజుల్లో ఆగిపోవచ్చు.

సాక్షిలో దిక్కుమాలిన యాంకర్ తో రామోజీరావు చేతులెత్తేశారని చదివిపించారు. ఆ పని ఏమీ జరగదు. ఎత్తిన చేతులతో మన నెత్తిపై గుద్ది భూమిలోకి దించేయడం ఖాయం. విజేత రామోజీ నా జమోరెనా అని రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు ప్రభుత్వ అధికారులు అంతా అన్ని మూసుకొని కూర్చోవాల్సిందేనని అన్నారు. ప్రజలు కూడా ఈ దమన కాండను నిరసించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

LEAVE A RESPONSE