-వైసీపీ వచ్చాక వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రజలు కోల్పోయారు
-స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – సేవ్ డెమెక్రసీ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఏపీ ప్రమాదం అంచుల్లో ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికయినా కళ్లు తెరవకపోతే పూర్యి స్వేచ్ఛ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక అవినీతిపరుడిని గెలిపించిన ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – సేవ్ డెమెక్రసీ అఖిలపక్ష సమావేశంలో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారంటే…
మూడున్నరేళ్లలో ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ. వైసీపీ వచ్చాక వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రజలు కోల్పోయారు.రాష్ట్రానికి ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయ్యాడు.జగన్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని వ్యక్తిగతంగా భావిస్తున్నా.తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు. మళ్లీ దోచుకోవడానికి సీఎం అయ్యాడు. ప్రజలు ఒక అవినీతి పరుడుకి ఓటేశారు. వైసీపీ తప్ప రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదనుకుంటున్నారు.
కేసులు పెట్టి, జైల్లో వేసినా ప్రతిపక్షాలన్నీ పోరాడుతున్నాయి. ఈ ముఖ్యమంత్రిపై అన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జగన్ రెడ్డి నాయకత్వంలోనే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పల్నాడులో 18 మంది బలహీన వర్గాలకు చెందిన వారిని హత్య చేశారు. మాచర్ల ఘటనతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం. సిద్దాంతాలు, పార్టీలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాద్యత అందరిపై ఉంది.