Suryaa.co.in

Telangana

కేసీఆర్ పాలన అంతం కోసం ప్రజల ఎదురుచూపు

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామర్సు బాలసుబ్రహ్మణ్యం

‘‘తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస, అవనీతి పాలన అంతం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న వాస్తవం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు తమ బాధలు చెప్పుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తున్న తీరు చూస్తే, కేసీఆర్ పాలనకు నూకలు చెల్లినట్లే

స్పష్టమవుతోంది. పాదయాత్రలో ప్రజానాడి అదే చెబుతోంది. అందుకే తెరాస నేతలు బీజేపీకి భయపడి, పనికిరాని విమర్శలు చేస్తున్నార’’ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీపార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. బీజేపీ దళపతి బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రలో బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే…

కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు

ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కేసీఆర్ పై వ్యతిరేకతతో గ్రామ గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి బండి సంజయ్ పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ప్రజలను కాపాడేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం.కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. కేసీఆర్ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని ప్రజలను కోరుతున్నా.

LEAVE A RESPONSE