-తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం ఉద్యోగాల్లో కావాలి.. కానీ, లిక్కర్ లో కాదు
– బిజెపి తమిళనాడు అధ్యక్షులు అన్నామలై
ప్రజా సంగ్రా యాత్ర అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభమైంది.
తమిళనాడే కాదు… వేరే రాష్ట్రాల ప్రజలు కూడా ప్రజా సంగ్రామ యాత్ర వైపు చూస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు తూట్లు పొడిచి ఆగం చేశాడు.
కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే.. ఆయన కుటుంబం పైనే ధ్యాస, ప్రేమ ఎక్కువ. అక్రమ సొమ్ము సంపాదనే ముఖ్యం..
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు తప్ప అభివృద్ధి శూన్యం. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలి. ప్రజా సంగ్రామ యాత్ర జరగకుండా బిజెపి కార్యకర్తలను భయపెట్టి, పోలీసులతో అడ్డుకోవాలని చూస్తున్నాడు. కాని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన బండి సంజయ్ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేదు.
నరేంద్ర మోదీ సెలవు అనేది లేకుండా పేద ప్రజల సంక్షేమం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేందుకు, పేదలకు గూడు కల్పించేందు కోసం అనునిత్యం శ్రమిస్తున్నారు.
పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు కట్టిస్తున్నారు.
మహిళల ఆత్మగౌరవం కాపాడేలా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేదింట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. నరేంద్ర మోదీ పాలనలో అవినీతి మచ్చ లేదు. పారదర్శక పాలన అందిస్తున్నారు. కాని, రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులంతా అవినీతిపేరును మూటగట్టుకున్నారు.
కృష్ణా-తుంగభద్ర నడుమ ఉన్న గద్వాల ఉంది. కాని, చుక్కనీరు రాలేదు. కారణం.. కేసీఆర్ అసమర్థ పాలనే. హుజురాబాద్ ఎన్నికలప్పుడు దళితులందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ చెప్పిండు. కాని రాష్ట్రంలో మరెక్కడా దళితబంధు ఇవ్వలేదు. 3 ఎకరాలు రాలేదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు కానివ్వకుండా పేదలను హింసిస్తున్నడు. ఆయుష్మాన్ భారత్ సహా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు కానివ్వడం లేదు. యువతకు ఉద్యోగాలిస్తానని చెప్పిన కేసీఆర్.. కొలువులివ్వకుండా, నోటిఫికేషన్లు వేయకుండా తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేస్తే అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్న దుస్థితి. కేసీఆర్ కూతురు కవిత…….. అహంకారంగా మాట్లాడిన్రు. ఆమె తండ్రి ఎక్కడుంటే అదే ఆఫీసు అంట.. ఆయనే దేవుడిని అహంకారపూరిత మాటలు చెప్పారు.
నేడు రాష్ట్రంలో లిక్కర్ నే ఆదాయ వనరుగా మలుచుకొని ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తోంది టీఆర్ఎస్ సర్కారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం ఉద్యోగాల్లో కావాలి.. కానీ, లిక్కర్ లో కాదు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ. కాని, వారి పట్ల సాంస్కారహీనంగా సోషల్ మీడియాలో దిష్టిబొమ్మలా అవమానపర్చడం బాధాకరం.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో,.. ప్రజలను డబ్బు, మద్యం ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించారు. భవిష్యత్తులోనూ ప్రజలు బిజెపి వైపే నిలవనున్నారు.
రూ. 10 వేలతో ఓటును కొనాలనుకుంటున్నా కేసీఆర్ కు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టనున్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యం.