అరుణమ్మ లేకపోతే.. మెడికల్ కాలేజీ వచ్చిందా..?

– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ

నడిగడ్డలో 8 వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర గద్వాల చేరుకున్నది. తెలంగాణ కోసం పోరాటం చేసిన సకల జనులు, అన్ని కులాలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకుల బలిదానంతోనే తెలంగాణ కల సాకారమైంది.తెలంగాణ సాధించుకున్న అనంతరం ఒక్క కుటుంబమే బంగారు కుటుంబంగా మారింది. ఆ కటుంబం ఏదో కూడా పసిపిల్లవాడికీ తెలుసు. తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి సొంత కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుని తెలంగాణను ఏలుతున్న కల్వకుంట్ల కుటుంబం.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటలగారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు ఎందరో ఉద్యమకారులను అందరినీ అవమానాల పాలు జేసిన కేసీఆర్…
ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిండు కేసీఆర్ .. రాయలసీమ నాయకులు అధికారంలో ఉన్నా ఆర్డీఎస్ పై పోరాటం చేసిన ఘనత మనదే తప్ప కేసీఆర్ ది కాదు..
ఆర్డీఎస్ రైతుల కష్టాలు, వ్యథలు కన్నీళ్లు తుడిచే దిక్కులేని పరిస్థితి నీది కాదా కేసీఆర్..
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం జేసిండు..

జూలకల్లు, వల్లూరు, ఇలా ఏ ప్రాజెక్టుకు అతీగతీ లేదు. మల్లమ్మ కుంట అవసరం లేదన్నడు.తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తిచేయమని సీఎం కేసీఆర్ ను అడిగా.. 1000 కోట్లు పెడితే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెబితే ఇప్పటివరకు అతీ గతీ లేదు.
శంకుస్థాపనలు చేయడం .. టెండర్లు పిలవడానికి డీపీఆర్ తయారు చేస్తున్నం అంటం.. ఓట్లు వచ్చినప్పుడే ప్రాజెక్టులు గుర్తుకు వస్తయ్.. అనంతరం ఫామ్ హౌస్ ల పంటడు..
ఉప ఎన్నిక వస్తేనే మహిళా సంఘాలకు వడ్డీ పైసలు వేస్తడు. అంతే .. ఓట్లు లేకపోతే ప్రాజెక్టుల ఊసుండదు.

దళిత వ్యతిరేకి బిజెపి అంటూ ప్రజలను రెచ్చగొడుతుండ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు వేస్తూ.. ఏనాడూ జయంతికి గానీ.. వర్ధంతికిగానీ దండ వేయని ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి.. సమాజాన్ని విడదీసి లబ్ధి పొందాలని కేసీఆర్ చేస్తుండు..మన పిల్లల భవిష్యత్ అంధకారమయ్యేలా కేసీఆర్ కుట్రలు చేస్తుండు.
నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రి మంజూరు చేయించిన.. 2004లో 78 ఎకరాలు కొని పట్టణంలో పట్టా భూములు కొని బీదవాళ్లకు ఇస్తే .. సిగ్గులేని దద్దమ్మలకు ఈ పేదల భూములు మెడికల్ కాలేజీకి కావాలట.. ఇది అన్యాయం.

రెండు బెడ్రూంల ఇండ్లు లేవు.. నేను ఇచ్చిన పట్టాలు గుంజుకుని ఇండ్లు కట్టి ఇంతవరకు ఒక్కరికీ ఇండ్లు ఇవ్వలే..ఇండ్లు లేవు.. మెడికల్ కాలేజీ పోయే.అరుణమ్మ ఉంటేనే నిధులు ఇస్తలేదన్నడు.. మరి అరుణమ్మ లేకపోతే.. మెడికల్ కాలేజీ వచ్చిందా..? జెఎన్ టీయూ వచ్చిందా.. నర్సింగ్ కాలేజీ వచ్చిందా.. నియోజకవర్గంలో ‘ ఏండ్ల నుంచి ఒక్క రోడ్డు వేసిండా..?
108 సిబ్బందికి జీతాలు లేవు.. 12 దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు..
పాలమూరు , రంగారెడ్డి 10వేల కోట్లున్నది 50వేల కోట్లు చేసిండు.. ఇప్పటివరకు అతీగతీ లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టంటూ లక్షా 20 వేల కోట్లు చేసిండు.. దోచుకుండు..
కల్వకుర్తి 8 ఏండ్లుగా పని చేస్తూనే ఉన్నడు.. 6 వేల కోట్లు ఉన్నటువంటి మద్యం ఆదాయం 30 వేల కోట్లు చేసిండంటే జనం సొమ్ము ఎంత దోచుకుంటుండో తెలుసుకోవాలి..
దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి అని జనం బిజెపిని గెలిపించారు..
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అన్న నినాదంతో మోదీ ఆధ్వర్యంలో బిజెపి పని చేస్తోంది.. తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి వస్తుంది.

Leave a Reply