కేసీఆర్.. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ ఎక్కడుందో చూపిస్తవా?

– పంటలు వేయకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన కేసీఆర్
– మాజీ మంత్రి ఈటల రాజేందర్

బీజేపీ అగ్రనేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ వస్తదన్న తెలంగాణ ఎక్కుడుందో చూపించాలని, ఆ మేరకు చర్చకు వస్తావా అని సవాల్ విసిరారు. ఈటల ఏమన్నారంటే…

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత 8 రోజులుగా అలుపెరుగకుండా బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. వివాహానికి వెళ్లినా,.. ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ప్రజలు అడుగుతున్నరు……. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రికి మతి తప్పింది. ఏం మాట్లాడుతున్నడో.. ఏంచేస్తున్నడో అర్థం కాకుండా ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పరిస్థితి అని.

హుజురాబాద్ లో ధర్మం గెలిచింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. బిజెపి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో అక్రమంగా సంపాదించిన వందల కోట్ల సొమ్మును హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఖర్చుపెట్టిండు.

20 వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున దళిత బంధు ఇచ్చి… ప్రమాణాలు చేయించుకున్నా…… కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టిన్రు.
కేసీఆర్ ను అడుగుతున్నాం……… ఆకలికేకలు లేని, ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ వస్తదన్నవ్. ఏది..?

కేసీఆర్ …… నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు వస్తవా…? ఏ ప్రాంతానికి అయినా వచ్చేందుకు మేం సిద్ధం. వరి వేయొద్దని కేసీఆర్ బెదిరించిండు. అయినప్పటికీ బిజెపి భరోసాతో రైతులు పంటలు వేసుకున్నరు. బావుల్లో నీళ్లున్నా.. 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.

రైతుబంధు ఇస్తున్నమంటూ జబ్బలు చర్చుకునే ముఖ్యమంత్రి……. రైతులు పంటలు వేయొద్దు… మేం అందుకు బిచ్చమిస్తమని చెప్పదల్చుకున్నడా ఈ ముఖ్యమంత్రి.
పంటలు వేయొద్దనా.. లేక వేసుకొమ్మనా…? రైతుబంధు ఇచ్చేది..?
2018 ఫిబ్రవరిలో రైతు సమన్వయ సమితి సమావేశం ఏర్పాటు చేసినవ్. అందులో రైతు ఏ పంట వేసుకోవాలో సమన్వయ సమితి నిర్ణయం తీసుకుంటదని చెప్పినవ్. ఇఫ్పుడేమైంది..? రైతు బీమా ఎందరికి ఇస్తున్నవో.. లెక్క బయటకు రానివ్వట్లేదు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చేసుకున్నంత…. మరింకా ఏ రాష్ట్రంలో లేదు.
అందుకే తెలంగాణ ప్రజానీకం ధర్మం కోసం, దేశం కోసం పోరాడుతన్న బిజెపిని ఆదరించాలి. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా…… ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే.

Leave a Reply