ప్రతి పేదవానికి పక్కా ఇల్లు

– గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్

రాష్ట్రంలో ప్రతి పేదవానికి పక్కా ఇల్లు ఉంది తీరాలనే సదుద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్ స్పష్టం చేసేరు. ఇప్పటికే మొదటి దశ కింద 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణాలు జరుగుతుండగా,రెండో దశ ఇళ్ళ నిర్మాణాలు కూడా ప్రారంభం అవుతాయాని మంత్రి వివరించారు. ఈ నెల 28వ తేదిన విశాఖపట్నంలో లక్ష మంది అక్కా చేల్లెమ్మలకు ఇళ్ళు నిర్మించుకునెందుకు అవసరమైన ఇంటి పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహనరెడ్డి పంపిణి చేస్తారని, అదేవిధంగా మరో 1.80 లక్షల మందికి ఇళ్ళు మంజూరు చేసి రెండో దశఇళ్ళ నిర్మాణాలను ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.

మంత్రి గా పదవి భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మంత్రి గురువారం ఆటో నగర్ లోని ఆంద్ర ప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించేరు. రాష్ట్రంలోని 26 జిల్లాల హౌసింగ్ అధికారులతో పాటు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశం ఆనంతరం మంత్రి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దఎత్తున ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఇళ్ళ నిర్మాణాలకు నిధులు సమస్య లేదని, అధికారులు లబ్దిదారులను చైతన్య పరిచి ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి కావటానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇంటి నిర్మాణాలలో లబ్దిదారులు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొనకుండా రహదారులు, నీరు, విద్యుత్ సౌకర్యం వంటి సదుపాయాలను వెంటనే కలుగ చేయాలని,ఈ పనులన్నిటి పైన జిల్లా కలక్టర్లు స్థానిక శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధుల తో సమన్వయం చేసుకోవాలని మంత్రి రమేష్ సూచించారు. రాష్ట్రంలో మొదటి దశలో ఇంతవరకు 24వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ అయ్యాయని,మరో లక్ష ఇళ్ళ నిర్మాణాలను మే నెల 15వ తేదికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి వివరించారు.ఇళ్ళ నిర్మాణాలలో పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలని,నిర్మాణాలలో ఎదురయ్యే లోపాలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేసారు.

బరువు కాదు భాద్యత
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి పక్కా ఇళ్ళు ఉండాలనే సదుద్దేశం తో దేశాలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ళు నిర్మించాలని ఈ పధకాన్ని ప్రారంభించారని ప్రతి ఉద్యోగి ఇది బరువు కాదు, భాద్యతగా భావించి పనిచేయాలని మంత్రి సూచించారు. విధి నిర్వహణలో ఏవిధమైన అలసత్వం వహించవద్దు అని సకాలంలో పనులు పూర్తి చేయటానికి అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఇళ్ళ నిర్మాణాలకు నిధులు సమస్య లేదని సకాలంలో పూర్తి చేసిన లబ్దిదారులకు బిల్లులు వెంటనే చెల్లిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి శ్రీ అజేయ్ జైన్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలలో లక్ష్యాలను పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు. ప్రతి రోజు సగటున 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులను పూర్తి చేయటానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ప్రత్యెక కార్యదర్శి రాహుల్ పాండే, ప్రత్యెక అధికారి కమలాకరబాబు, చీఫ్ ఇంజనీర్ జి.వి ప్రసాద్, సుపరెండేంట్ ఇంజినీర్లు 26 జిల్లాల గృహనిర్మాణ శాఖ భాద్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటి ఫై ఉంచాల్సిన లోగోను మంత్రి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు పరిశీలించారు.

Leave a Reply