– యాసిడ్ దాడికి గురైన మహిళకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తాం
– యాసిడ్ దాడులను సహించేది లేదు
– కేవలం 15 నిమిషాల్లోనే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది
– యాసిడ్ దాడి సంఘటనపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్
– రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
మదనపల్లి : గుర్రంకొండ మండలం, ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన గణేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యాసిడ్ దాడికి గురైన మహిళలను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి జయ చంద్రారెడ్డి, శ్రీరామ్ చిన్నబాబు లతో కలిసి మంత్రివర్యులు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాధితురాలని, వారి తల్లిదండ్రులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. గుర్రంకొండ మండలం, ప్యారంపల్లెకు చెందిన గౌతమి అనే మహిళ డిగ్రీ పూర్తి చేసుకొని బ్యూటిషన్ పని చేసుకుంటూ ఉండేదన్నారు. ఈమెపై గణేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడం జరిగిందని యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని కేవలం 15 నిమిషాల లోనే అదుపులోకి తీసుకుని నిందితుడిని రిమాండ్ కు పంపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ళలపై యాసిడ్ దాడులకు పాల్పడే వ్యక్తులను సహించేది లేదని అలాంటి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలు ముందస్తు జాగ్రత్తగా పోలీసులను ఆశ్రయించాలన్నారు.
యాసిడ్ దాడికి గురైన మహిళను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యాసిడ్ బాధితురాలు ఆరోగ్యం గురించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి ఫోన్ చేసి బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యాసిడ్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు పూర్తిగా కోరుకునేంతవరకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందని నారా లోకేష్ మంత్రివర్యులకు తెలిపారు.