– 2019లో వైఎస్ఆర్సిపి సత్తా ఏంటో చూపించాం
– గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్ రెడ్డి పట్టుబడలేదా ?అదేమైనా ప్రతిపక్షాల కుట్ర అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న దాచేపల్లి పట్టణంలో డబ్బులు పంచుతూ, మద్యం పంచుతూ ఒకరిద్దరు టిడిపికి చెందిన వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి వైసీపీకి ఏంటి సంబంధం? దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి అని అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. దమ్ము ధైర్యం గురించి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్ కి వెళ్ళిన వైసిపినే గెలుస్తుంది. అంటే ప్రజల మనసుల్లో వైఎస్ఆర్సిపి పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుండి ఎన్నికల్లో డబ్బులు పంచె సంస్కృతి చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈరోజు యావత్ రాష్ట్రాన్ని దహించివేస్తుంది .మేము పట్టుబట్టి దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీలుగా చేశాం. మీరు కోర్టులకు వెళ్లి ఆపాలని చూశారు… ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. రేపు 15వ తారీకు జరుగు మున్సిపల్ ఎన్నికల్లో గురజాల దాచేపల్లి మునిసిపాలిటీలలో 40 వార్డులకు 40 వార్డులు గెలిచి చూపిస్తాం. యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం,తొడలు చారుస్తాం అనే మాటలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం కోసం మాత్రమే టిడిపి వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్.వాళ్లు సోషల్ మీడియా కోసమే ప్రచారం చేస్తారు ,మేము ప్రజల కోసం అభివృద్ధి కోసం మాట్లాడతాం.