– మాజీ మంత్రి కేఎస్ జవహర్
రాజధానికి భూములిచ్చిన, అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి మాట మార్చారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అని చెప్పి స్వయంగా చిచ్చు పెడుతున్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని ఘనంగా పొగిడిన జగన్ రెడ్డి నేడు అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మూడు రాజధానుల ముచ్చట తెచ్చి అమరావతిలో పెట్టిన కుంపటిని ఆర్పే ప్రయత్నం చేయడంలేదు. సిఆర్డిఏ పరిధిని కుంచించి మున్సిపల్ అథారటీని తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారు.
జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయమే సిపియస్ రద్దు అని వారే ఒప్పుకున్నారు. మధ్యపాన నిషేధంతో అధికారంలోకి వచ్చి దశల వారిగా మధ్యపాన నిషేధం విధిస్తామనిని ప్రజలని మభ్యపెట్టారు. మద్యం ప్రియులను 25 ఏళ్ళకు తాకట్టు పెట్టారు. అమరావతి రైతులు జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలకు బలౌతున్నారు. రైతులు న్యాయం స్ధానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు యాత్ర చేసినా జగన్ పట్టించుకోవడంలేదు. హైకోర్టు 6 నెలలోపు రాజధాని పనులు ప్రారంభించమని చెప్పినా నేటికి పనులు మొదలు పెట్టలేదు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. రాజధాని నిర్మాణం చేపట్టాలంటే 6 నెలల్లో పనులు పూర్తి చేయలేమని, 60 నెలలు పడుతుందని చేతులెత్తేశారు. రైతుల కౌలు, అభివృద్ధి విషయంలో మోసం చేశారు. అమరావతి నుంచి అరసవెల్లి దేవస్థానానికి పాదయాత్రగా రైతులు వెళ్లాలనుకుంటే ఇది పాదయాత్ర కాదు దండయాత్ర అని వైసీపీ మంత్రులు మాట్లాడటం బాధాకరం. 29 ఎకరాలు ఇచ్చిన రైతులేకాక రాష్ట్రంలో 600మంది రైతులు పాదయాత్ర చేయబోతున్నారు. వాళ్లకి రక్షణ కల్పించలేని పరిస్థితులలో జగన్ రెడ్డి ఉన్నాడు.
జగన్ రెడ్డి తాబేదారులు కొడాలి నాని, అమరనాథ్, అప్పల రాజు లు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో వీళ్లు అనేక భూములు దోచేశారు. రుషికొండ, ఇతర ప్రాంతంలో భూకబ్జా చేసినప్పుడు జరిగిన దండ యాత్రలు వారు గుర్తుకు తెచ్చుకోవాలి. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన వారు పాదయాత్ర చేస్తుంటే దండయాత్ర ఎలా అవుతుందో జగన్ చెప్పాలి.
చంద్రబాబు నాయుడు నిధుల సేకరణ కోసం బిక్షాటన చేపిస్తున్నారన్న కొడాలి నానిది నోరు కాదు తాటిమట్ట. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కుక్క మనల్ని కరిచిందని కుక్కని మనం కరవలేం.
కొడాలి నానికి జ్ఞానం, విఘ్నత లేవు. అతని గురించి మాట్లాడక పోవడమే మంచిది. సీదిరి అప్పలరాజు తన నియోజక వర్గంలోని మహిళల పట్ల ఎలా ప్రవర్తించాడో అందరికి తెలుసు. అమరనాధ్ కి తిట్టడం కంటే తిట్టించు కోవడం అలవాటు. విశాఖపట్నం ఏ విధంగా కబ్జాకి గురయిందంటే అతడి ల్లనే. అక్కడి ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల ప్రజలు తమ ప్రాణాలను నష్టపోతున్నారు. కాలుష్య నివారణఖు శ్రద్ధ చూపని వ్యక్తి అమరనాధ్. పాదయాత్రలో పువ్వులే పడతాయి రాళ్లేమి పడవని తెలుసుకోవాలి.
అన్నం పెట్టే రైతులను ఏవిదంగా చూడాలో అందరికీ తెలుసు. రాయలసీమకు న్యాయ రాజధాని వస్తుందని.. దాన్ని అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అది అబద్ధం. అమరావతి రైతులను పూల పాన్పు పై నడిపించడం చూశాం. 12వ తేదీన జరిగే మహా పాదయాత్రలో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలవాసులు రైతులకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. దానికి భయపడే వైసీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డివి అనాలోచిత నిర్ణయాలని ఒప్పుకోవాలి. అమరావతి గురించి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పాదయాత్ర చేరే వరకు ప్రజలు వెన్నంటే ఉంటారు, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఏపార్టీకి సంబంధంలేని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం తగదు.
రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు వణికిపోయి నేడు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డివి అనాలోచిత నిర్ణయాలు అని ఒప్పుకోవాలి. ఆరోజు అసెంబ్లీలో అమరావతి గురించి మాట్లాడిన తీరు తప్పు అని ఒప్పుకోండి. సీపీఎస్ వి అనాలోచిత నిర్ణయాలని ఒప్పుకున్నట్లే అమరావతి విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు బుద్ది చెబుతారు. భారతిరెడ్డికి సంచులు మోసినట్లు టీడీపీలో ఎవరూ మోయడంలేదు. టీడీపీ వైసీపీలా సూట్ కేసుల కంపెనీలు పెట్టి మోసం చేయలేదు. వైసీపీ హత్యలను ప్రోత్సహించినట్లు టీడీపీ ప్రోత్సహించలేదు. పోతుల సునీత కు చంద్రబాబు కుటుంబం గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడడం ఇది తాడేపల్లి డైరెక్షనే.
నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లక్మీపార్వతి హార్మోనియం స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. తలెత్తుకొనే పనులు చేయాలి తప్ప కించపరచే పనులు చేయొద్దు. చంద్రబాబు నాయుడుకు రెండు ఎకరాలు ఉన్నింది అని మాట్లాడుతున్నారు.. రెండెకరాల పొలంతో కోట్లు సంపాదించినవారు లేరా?చంద్రబాబు కుటుంబం కష్టపడి హెరిటేజ్ ను అభివృద్ధి చేసుకున్నారు. ఎన్టీరామారావు అల్లుడిగా చంద్రబాబు, బాలయ్యబాబు కుమార్తె బ్రాహ్మణి, ఎన్టీరామారావు కుమార్తె భువనేశ్వరి లు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులు. ఎన్టీరామారావు రిజిస్ట్రార్ గా పనిచేసి తరువాత మహోన్నత నటుడిగా మారి అందరికి ఆదర్శ పురుషుడయ్యారు. లక్ష్మీ పార్వతి ఆస్తుల వివాదం తెచ్చారు. ఆమెకు అవసరమా?
జగన్ పక్షాన చేరి చిలక పలుకులు పలుకుతున్నారు. కేవలం చంద్రబాబును, టీడీపీని తిడతావనే ఉద్దేశంతోనే లక్ష్మీపార్వతిని జగన్ చేరదీశారు. చంద్రబాబునాయుడుపై సుప్రీంకోర్టులో కేసు వేయడం అవసరమా? చంద్రబాబునాయుడుపై అవాకులు చవాకులు పేల్చడం మానాలి. లిక్కర్ స్కామ్ లో ఉన్న భారతి రెడ్డిని కాపాడటానికి భువనేశ్వరి, బ్రాహ్మణిలను ఉచ్చులోకి లాగుతున్నారు. మీ సచ్చీలతను నిరూపించుకోవాలి. లక్ష్మీపార్వతి అనవసర విషయాలు మాట్లాడి జనంలో ఉన్న విలువను పోగొట్టుకోవద్దు. ప్రతి వ్యక్తి అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు మద్దతుగా నిలవాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పిలుపునిచ్చారు.