తల్లుల ఖాతాల్లో రూ. 61.73 కోట్లు యూనిఫాం కుట్టు కూలీలు జమ

– సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్

‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా 2021-22 విద్యా సంవత్సరానికిగానూ విద్యార్థులకు ఇచ్చిన 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టు కూలీ కోసం 43,06,032 మంది తల్లుల ఖాతాల్లో రూ. 61,72,82,160/-లు శుక్రవారం జమ చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 జతల కుట్టు కూలీకి గానూ రూ. 120, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రూ. 240 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు- రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, పిక్టోరియల్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీతో పాటు బ్యాగు కిట్ గా అందించామని తెలిపారు.

Leave a Reply