Suryaa.co.in

Andhra Pradesh

ఇన్నాళ్లకు బాబు సరైనోడు చేతికి చిక్కాడు!

– దశాబ్దాలుగా స్కాములు చేస్తూ.. చంద్ర స్వామీజీలా ఫోజులు కొట్టాడు
– స్కిల్ స్కామ్ లో రూ. 371 కోట్లు తిన్న బాబును అరెస్టు చేస్తే తప్పేంటి?
– బాబు అరెస్టు నుంచి.. జైలు వరకు ఎక్కడా కక్షసాధింపులు లేవు
– పాపాల భైరవుడు బాబు సిగ్గు పడకుండా.. వేళ్ళు ఊపుకుంటూ జైలుకు..!
– కోటిన్నర ఇచ్చి తెచ్చిన ప్లీడర్ కూడా బాబు అవినీతి చేయలేదని వాదించలేదు
– అవినీతిపై రాజీలేని పోరాటం అంటే.. వాటా కోసం రోడ్ల మీద పోరాటమా పవన్ కల్యాణ్..?
– పిచ్చి కాకపోతే.. అవినీతి బాబుకు పవన్ మద్దతా.. ఇదేం పొయ్యేకాలం!
– పేర్ని నాని ఫైర్

ఇన్ని దశాబ్దాలకు చంద్రబాబు చట్టానికి చిక్కాడు. 1978 నుంచి చట్టానికి దొరక్కుండా, న్యాయస్థానాలను ఎల్లకాలం ఏమార్చడం సాధ్యం కాదు అని రుజువైంది. ఇన్నాళ్ళకు తెలుగువారికి న్యాయస్థానాల మీద విశ్వాసం పెరగటానికి, ఇంతకాలానికి న్యాయం, ధర్మం గెలిచిందని గొప్ప అనుభూతి తెలుగు ప్రజలకు కలిగింది.

చంద్రబాబు ఎంతో అవినీతి, ఎన్నో అక్రమాలు చేసినా.. ప్రభుత్వాలుగానీ, వ్యవస్థలుగానీ ఎంత పోరాటం చేసినా, తన కుయుక్తులు, నక్క జిత్తులతో పట్టుబడకుండా, స్టేల మీద వ్యవస్థలను ఏమార్చుకుంటూ 45 ఏళ్ళుగా చక్రం తిప్పుతున్నాడు.నూరు గొడ్లను తిన్న రాబందు.. ఒక్క సరైన తుపానుకు నేలకూలినట్టు.. ఇన్నేళ్ళుగా ఎవరికీ చిక్కకుండా నీతిమంతుడుగా చలామణి అవుతున్న బాబు.. ఇవాళ సీఐడీ అధికారులకు చిక్కాడు.

ఆఖరికి, తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఓటు కోసం లంచం ఇస్తూ.. ఓటుకు కోట్లు ఇస్తూ.. ఆడియో, వీడియోల ద్వారా పచ్చిగా దొరికిపోయి, పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా అనుభవించాల్సిన హైదరాబాద్ నగరాన్ని కూడా వదిలేసి వచ్చాడు. ఇన్నాళ్ళకు పాపం పండింది. సరైనోడు చేతికి చిక్కాడు. ఇది కేవలం తీగ మాత్రమే.

కోర్టులోకి మీ కుటుంబ సభ్యులంతా వస్తుంటే.. పోలీసులు అనుమతించారా.. లేదా..?
మందులు వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలని.. హౌస్ అరెస్ట్ కు ఇమ్మని మీ లాయర్లు అడిగితే.. జైల్లో ఆయనకు సకాల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయవాదులు నో అబ్జెక్షన్ చెప్పారా? లేదా? చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా..?

దీనికి సంబంధించి, ఐఏఎస్ అధికారులు సునీత, పీవీ రమేష్.. మరికొందరు అడ్డుకున్నా.. చంద్రబాబు ప్రత్యేక ఇంట్రస్ట్ తో ఈ స్కామ్ చేశారు. చంద్రబాబు ఒత్తిడి వల్లే ఈ డబ్బు విడుదల చేశామని జడ్జి దగ్గర 164 స్టేట్ మెంటు ఇచ్చారు.

మాకు ఆయనపై మర్యాద, గౌరవం తప్పితే.. చంద్రబాబు పట్ల కక్ష అనేది లేదు. ఆయన స్కిల్ స్కాము పేరుతో రూ. 371 కోట్లు దోచుకున్నాడనే ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించింది. ఒక నేరం జరిగితే.. దొంగ దొరికితే.. అతన్ని విచారించి, ఎలా అయితే కోర్టులో ప్రవేశపెడతామో అలానే చంద్రబాబును అరెస్టు చేశాము.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై..
చంద్రబాబును అరెస్టు చేస్తే.. లోకేష్ ఏమో బస్సు టైరు దగ్గర నేల మీద కూర్చుంటే.. చంద్రబాబు దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా హైవే మీద పొర్లాడాడు.జనసేన పార్టీ ఆలోచన సిద్ధాంతం- కులాలను కలిపే ఆలోచనా విధానం అన్నాడు. కమ్మ-కాపులను కలిపే ఆలోచనా విధానం ఆయనది. మతాల ప్రస్తావన లేదంటూనే.. నిత్యం మతాల గురించి మాట్లాడతాడు. నేతి బీర కాయలో మాదిరిగా జనసేన సిద్ధాంతాలు ఉన్నాయి.పవన్ కల్యాణ్.. ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి కేసు. ఆయన విజయవాడలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న సైక్రియాట్రిస్టు. పవన్ కల్యాణ్ కు ఉన్నది సైకలాజికల్ డిజార్డర్.

LEAVE A RESPONSE