– అన్ని కులాలు కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయాలా పవన్?
– కాపులను రెచ్చగొట్టి..భావోద్వేగాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం
– కులాలపై మీ దుర్మార్గమైన రాజకీయ క్రీడ కట్టిపెట్టండి
– రంగాను కాపులు అభిమానిస్తున్నారనే ఈర్ష పవన్ లో కనిపిస్తోంది
– మీరంతా కలిసే రండి..మేం కోరుకునేది అదే..
– ఎన్నికల వరకూ ఎందుకు..? ఇప్పుడే మీరు ముసుగు తీయొచ్చు కదా..
– మా ప్లీనరీలోనే చెప్పాం..మీరు కలిసి రండి..జగన్మోహన్‌రెడ్డి చితకొట్టి పంపిస్తారు
– మళ్లీ మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి..అదే పరిపాలన అందిస్తాం అని చెప్పే దమ్ముందా..?
– దృతరాష్టులు, దుర్యోధనులు, దుశ్శాసనులు అందరూ పవన్ తోనే ఉన్నారు
– సినీ జీవితాన్నిచ్చిన చిరంజీవినీ పవన్ అవమానించాడు
– అసలు చిరంజీవి పార్టీని మూసేయడానికి కారణం పవన్ కాదా..?
– వెయ్యి కోట్లు అన్న వ్యక్తిని వదిలేసి మామీద పడతావేం..?
– బందరులో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి కాపు డిక్లరేషన్ చేశాడు
– నీ వద్ద ఏం చూసి కాపులు, కాపు నాయకులు నీ వెంట నడవాలి పవన్..?
– నమ్మినవారి కోసం జగన్ దేనికైనా సిద్ధం..అదీ నాయకత్వ లక్షణం
– జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం
– నువ్వు కమ్మ వారికి ఊడిగం చేస్తున్నావ్…అని నేను కూడా అనగలను..!
– “దిక్కుమాలిన చంద్రబాబు..అవినీతి లోకేశ్” అన్న మాటలు ఏమయ్యాయ్ పవన్..?
– ఇంతలోనే చంద్రబాబు- లోకేశ్ లు ఏం సంస్కరించబడ్డారు..?
-ఃమాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని)
మచిలీపట్నం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్‌ని అభిమానించే వారి ఆలోచనలు, వారి మనసుకు రుచించని మాటల్ని తీయటి పంచదార పూత పూసి చెప్పాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరిమీదైతే ఆయన ద్వేషంతో పార్టీ పెట్టాడో, ఎవరినైతే రాజకీయంగా అడ్డుకోవాలని పార్టీ పెట్టాడో..ఎవరి మేలు కోసం రాజకీయాలు చేయాలనుకున్నాడో దానికోసం తాపత్రయ పడ్డాడే తప్ప అక్కడ కొత్తదనమేమీ లేదు
ఏతా వాతా ఆయన చెప్పింది బీజేపీతో కటింగ్ అని చెప్పాడు. అలా చెప్పడానికి కూడా భయపడుతున్నాడు. మోడీ, అమిత్ షా, నడ్డా అంతా మంచోళ్లే కానీ..ఇక్కడి వారు మాత్రం సన్నాసులు అంటున్నాడు. యథావిధిగా నేను చంద్రబాబును కాపాడదలుచుకున్నాను…అతనితోనే వెళ్తున్నాను..మీరంతా నాకు ఓటేసేయండి అని మాత్రం చెప్పాడు.
కాపులను రెచ్చగొట్టి..భావోద్వేగాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం:
మొన్నటి వరకూ నాకు కులం లేదు అన్నాడు..నిన్న ఉపోద్ఘాతంలోనూ అదే చెప్పాడు.కానీ తన ప్రసంగంలో మాత్రం ప్రత్యేకించి కాపు కులస్థులను రెచ్చగొట్టి, భావోద్వేగాలను రేపే ప్రయత్నం చేశాడు.కాపులందరికీ కమ్మ వారి మీద ద్వేషం ఎందుకు…రెడ్లపై, జగన్మోహన్‌రెడ్డి గారిపై ప్రేమ ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. నా మార్గంలోకి వచ్చేయండి…అందరం కలిసి చంద్రబాబుకు ఊడిగం చేద్దామని చెప్పకనే చెప్పాడు.
మిమ్మల్ని నమ్మితే మీరేం చేస్తారో కాపులందరికీ తెలుసు:
తనకు అసెంబ్లీలోకి వెళ్లాలన్న కోరిక తీరలేదు…ఒక్క సారన్నా అసెంబ్లీలోకి వెళ్లాలి అని చెప్తున్నాడు పవన్ కల్యాణ్.దానికోసం మిమ్మల్ని అందర్నీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్తాను..నాతో వచ్చేవాడే నా వాడు అంటున్నాడు.నేను నాయకత్వం చేయను…నేను మాట ఇస్తాను కానీ..నెరవేర్చే విషయం నాకు సంబంధం లేదు అంటాడు. మిమ్మల్ని నమ్మితే మీరేం చేస్తారోకాపు కులస్థులు అందరికీ తెలుసు. మెజార్టీ శాతం కాపులు జగన్మోహన్‌రెడ్డి గారితోనే ఉన్నారు..ఉండితీరతారు..ఉంటారు. నమ్మిన వారికి చేయి అందించడానికి మా నాయకుడు జగన్ గారు ఎంతకైనా నిలబడి ఉంటాడు అనేది కాపులంతా నమ్ముతున్నారు.కచ్చితంగా మీ అభిమానం అనే మత్తులో ఉన్నవారు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టుకోండి.కులాలను రెచ్చగొట్టి కులరహిత సమాజాన్ని కోరుకుంటాను అని చెప్తూనే రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం ధర్మమా..? నోటితో ఒక మాట చెప్తూ చేసే పనులు మరొకటిగా మీరు సాగిస్తున్న ఈ దుర్మార్గమైన రాజకీయ క్రీడ కట్టిపెట్టండి. ముసుగులు తీసి చంద్రబాబు, నువ్వు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని జగన్‌గారిపై పోరాటానికి రండి. మేం కోరుకునేది కూడా అదే…2024 ఎన్నికల్లో మిమ్మల్ని ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. జగన్మోహన్‌రెడ్డి గారికి పట్టం కట్టి వాళ్ళ గుండెల్లో ఉన్న అభిమానాన్ని చూపించి మీ నోళ్లు మూయించే రోజు కొద్ది నెలల్లోనే ఉంది. కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ నిన్న అర్ధరాత్రి మద్దెలదరువులో అంతా కులాల మాటే మాట్లాడాడు పవన్.కాపు కులం పేరు 127 సార్లు, కమ్మ అని 14, రెడ్డి అని 22 సార్లు, రెల్లి అని 21 సార్లు, మాదిగ అని 17 సార్లు, నూర్ బాషా 7 సార్లు,ముస్లింలు 13 సార్లు మాట్లాడారని చెప్తున్నాడు.ప్రతి ఐదు పది సెకన్లకోసారి కులం పేరు తీస్తూ ఈయన కులరహిత సమాజాన్ని నిర్మిస్తాడట… కాపులంతా అరాధిస్తున్న రంగానే కమ్మ వారి అమ్మాయిని చేసుకున్నాడు..మనమెంత అంటున్నాడు. కాపులు అందరం వెళ్లి చంద్రబాబు పల్లకీ మోద్దాం అని చెప్తున్నాడు. మహానుభావా.. డొంకతిరుగుడు వ్యవహారాలు లేకుండా నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి సీట్లు పంచుకుని కలిసి పోటీ అని చెప్పి ఊరేగండి.
రంగాను ఇంకా అభిమానిస్తున్నారనే ఈర్ష:
కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా ఆరాధించబడే వారంతా మిగతా కులాల్లో పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసి పిల్లల్ని కన్నారు అని చెప్తున్నాడు. అటువంటపుడు మనం చంద్రబాబుతో కలిసి వెళ్లిపోవడంలో తప్పేముంది అంటున్నాడు. రంగా కాపు కులస్తులందరికీ ఆదర్శ దైవం. ఆయన్ని కిరాతకంగా ఎవరు చంపారో అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు.రంగాని చంపి మూడు దశాబ్ధాలు అయినా కాపులంతా ఆయన్ని ఇంకా అభిమానిస్తున్నారని పవన్ ఈర్ష పడుతున్నాడు. కాపు నాయకుడు సతీమణి కమ్మ కులం కాబట్టి…ఆయన కుమారుడు కమ్మకి, కాపుకి కలిసి పుట్టాడని చెప్తూ అక్కడ అభ్యంతరం లేనిది మనం చంద్రబాబు వద్దకు వెళితే తప్పేంటి అని అడుగుతున్నాడు.ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్సిగ్గుగా బహిరంగంగా కుల రాజకీయాలు చేయడం, కులాన్ని ఎగదోయడం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది.కాపులందరం కలిసి కమ్మ వారి వద్దకు వెళితే తప్పేంటి అని వేడుకొంటున్నాడు.
మీరంతా కలిసే రండి..మేం కోరుకునేది అదే:
మేం చెప్పేది కూడా అదే…మీరెంత మంది కలిసి వచ్చినా మేం ఒంటరిగా పోటీ చేస్తాం అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాం.2014లో కూడా మీరంతా కలిసే వచ్చారు…2019లో జగన్‌గారిని అధికారంలోకి రానివ్వకూడదని చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందంతో విడివిడిగా పోటీ చేశారు.ఎన్నికల వరకూ ఎందుకు..? మీరు ఇప్పుడే ముసుగు తీయండి అని మేము కూడా చెప్తున్నాంమా ప్లీనరీలోనే చెప్పాం.. మీరెంత మంది కలిసి వచ్చినా..జగన్మోహన్‌రెడ్డి గారు మీ అందర్నీ చితకొట్టి పంపిస్తాడు. మీరు అంటే మాకు భయం ఎందుకు..అసలు మీ గురించి మాకు ఆలోచన ఏంటి..?మీరంతా కలిసివస్తేనే కదా…జగన్‌గారు సత్తా ఎంటి అనేది మీకు తెలిసేది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చాలెంజ్ చేస్తున్నాను…మళ్లీ మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి..గతంలో అందించిన, అదే పరిపాలన అందిస్తాం అని ఓటు అడిగే దమ్ము ఉందా మీకు..?
తొడలుగొట్టే బ్యాచ్ మీదే..:
తొడలు గొట్టే బ్యాచ్ మేం కాదు…రేపు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి కలిసే వాళ్లే కదా తొడలు కొడుతుంది. ఆఖరికి ఆడోళ్ల చేత కూడా తొడలు కొట్టించారు కదా..దృతరాష్ట్రులను, దుర్యోధనులను, దుశ్శాసనులను అందర్నీ నీతోనే పెట్టుకుని, వారితో అంటకాగుతూ పవన్ తొడలు బద్ధలు కొడతానని మాట్లాడుతున్నాడు.
మేమేమన్నా తిడితే మళ్లీ నన్ను తిరిగి తిడుతున్నారు..వారందరితో శిస్తు కట్టిస్తానంటున్నాడు. ఇంకో జన్మ ఎత్తినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో శిస్తు కట్టించడం నీవల్ల, నీ యజమాని చంద్రబాబు వల్ల కూడా కాదు.
సినీ జీవితాన్నిచ్చిన చిరంజీవినీ అవమానించాడు:
పవన్ కు సినీ జీవితాన్నిచ్చి, పది మందిలో గుర్తింపునిచ్చిన చిరంజీవిరిని కూడా అవమానిస్తున్నాడు. పార్టీలు పెడతారు..మూసేస్తారు అంటూ చిరంజీవి గారిని అవమానించాడు. కొత్తగా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి రావడం ఏమిటి…పవన్ కళ్యాణ్..?2009లో నువ్వు యువరాజ్యం అధ్యక్షుడివి కాదా…అది రాజకీయం కదా…ప్రజారాజ్యం రాజకీయ పార్టీ కాదా..? నాకంటే ముందు మా ఇంట్లో ఎవరూ రాజకీయ నాయకులు లేరు అంటున్నాడు.2014లో పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టేటప్పుడు నీ సొంత అన్న చిరంజీవి కేంద్ర మంత్రి కదా..?అసలు చిరంజీవి గారు పార్టీని మూసేయడానికి కారణం మీరు కాదా..?ఓడిపోగానే చిరంజీవి గారిని ఒంటరిగా వదిలేసింది ఈ మహానుభావుడు కాదా..? ముస్లింల కోసం బీజేపీని వదిలేస్తాను అంటున్నాడు… ఇక చంద్రబాబుతో వచ్చేస్తాను అంటున్నాడు.. డబ్బుల్లేవంటాడు… రోజుకు రెండు కోట్లు నా సంపాదన అంటాడు. ఈ ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని మొన్న చెప్పాడు. ఇందులో ఇన్ కం టాక్స్ కట్టేదెంత..? కట్టనిదెంత..? ఆయన డబ్బులు ఆయనిష్టం అనుకోండి. రాజకీయాలకు డబ్బు కావాలంటూనే… మళ్లీ డబ్బు అక్కర్లేదంటాడు.
వెయ్యి కోట్లు అన్న వ్యక్తిని వదిలేసి మామీద పడతావేం..?:
ఇతన్ని వెయ్యి కోట్లు అన్న వ్యక్తి బాగానే ఉన్నాడు…ఆ పేపర్ చదివినందుకు మమ్మల్ని తిడుతున్నాడు. అన్నది అతను…అనిపించుకున్నది ఇతను…అతనేం చూశాడో…ఏం విన్నాడో…నువ్వేం తీసుకోబోయావో మీ ఇద్దరికే తెలియాలి.ఆయన్ని వదిలేశాడు..చివరికి లోకువ మాత్రం వైఎస్సార్సీపీలోని కాపులు మాత్రమే.
బీసీ డిక్లరేషన్ చేస్తానని కాపు డిక్లరేషన్ చేశాడు:
బీసీ సదస్సులో జన్మతహా నేను కాపుగా పుట్టాను…అందుకే కాపునయ్యాను తప్ప నేనూ బీసీనే అన్నాడు. బీసీలతో మీటింగు పెట్టి ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్ చేస్తాను అన్నాడు. కానీ కాపు ఓటు డిక్లరేషన్ చేశాడు..బీసీ డిక్లరేషన్ ఏమైంది..?బందరులో బీసీ డిక్లరేషన్ చేస్తాను అని హామీ ఇచ్చిన 48 గంటలు గడవక ముందే కాపు ఓటు డిక్లరేషన్ చేశాడు. ఎవరైనా ఆవిర్భావ సభ, ప్లీనరీలు పెట్టుకుంటే వారి దిశానిర్ధేశం ఏంటని ఆలోచిస్తారు.ఈయన మాత్రం ఎంతసేపు కాపులు, ఓట్లు అంటూ ఆ ఓట్లను చంద్రబాబుకు ఇవ్వడానికి తాపత్రయ పడుతున్నాడు. నేను చెప్తున్నాను…నా వెంట రండి అంటున్నాడు. అసలు దీన్ని రాజకీయ పార్టీ అని ఎవరైనా అంటారా..? ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ఎవరైనా అంటారా..?మేము ఏదైనా అంటే బాధపడటం..మీరు తిడితే మేం తిడతాం..మీరు మా పేరు ఎత్తక పోతే మేం కూడా నీ పేరు ఎత్తం.మీ ఇంటికి మా ఇల్లు ఎంతదూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం మహానుభావా…
నీ నడక సాఫీగా ఉంటే కదా..:
మేం కూడా నువ్వు చెప్పిందే చెప్తున్నాం…నువ్వు గుణం కలిగిన వాడివైతే..నువ్వు మంచివాడివైతే..పద్దతి కలిగిన వాడివైతే నీ వెనుక ఎవరైనా తిరుగుతారు..మహానుభావా..నీ నడక సాఫీదే అయితే..నీ సంకల్పం గొప్పదైతే..నాయకత్వ పటిమ, లక్షణాలు మంచివైతే..నమ్ముకున్న కార్యకర్తలకోసం ఎంతకైనా తెగిస్తాడు అని నమ్మకం కలిగిస్తే నీ వెంటే తిరుగుతారు. జగన్మోహన్‌రెడ్డి గారు ఒక నాయకత్వ పటిమ ఉన్నావారు.నమ్ముకున్న వారి కోసం, ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తారు.నమ్మిన సిద్ధాంతం కోసం, తన చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారు…అవీ నాయకత్వ లక్షణాలు అంటే… అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు మేం గర్వపడుతున్నాం.
కమ్మ వారికి ఊడిగం చేస్తున్నావ్…అని నేను కూడా అనగలను..:
ఓ పెద్ద మనిషీ…2014 నుంచి మీరు పచ్చిగా కాపు కులస్తులందరినీ పోగేసి గంపగుత్తగా చంద్రబాబుకు అప్పజెప్పాలని చూస్తున్నావ్. మేం రెడ్డి కింద ఊడిగం చేయడం కాదు…నువ్వు కమ్మవారికి ఊడిగం చేస్తున్నావు అని నేను కూడా అనగలను…కానీ అనను.అది నిజమైనా సరే..ఎట్టిపరిస్థితుల్లో అనను..
చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే సత్తా లేక ఇతనితో మాట్లాడిస్తున్నాడు. చంద్రబాబును పిలిచి నువ్వు బీసీలకు ఏం చేశావో చెప్పవయ్యా అంటే బొక్క బోర్లా పడిపోతాడు. రాజ్యసభ సభ్యుల పదవులను డబ్బున్నోళ్లకి అమ్ముకున్నాడు…ఎమ్మెల్సీ పదవులు పెద్ద పెద్ద కులస్తులకు ఇచ్చాడు చంద్రబాబు..బడుగు బలహీనవర్గాల్లో ఎవరో ఒకరికి ఇచ్చి దాన్నో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబుకు దిక్కుతోచక, మా ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపించలేక..అలా చూపిస్తే తన పాపాలు, లోపాలకు తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పవన్‌కళ్యాణ్‌ని ముందు పెడుతున్నాడు బాబు.అందుకే ఈ మహానుభావుడ్ని ఒక వేదిక ఎక్కించి కులాల గురించి మాట్లాడిస్తున్నాడు..ఈ పెద్ద మనిషి ఆతనికి పావులా ఉపయోగపడుతున్నాడు.
దిక్కుమాలిన చంద్రబాబు..అవినీతి లోకేశ్ అన్న మాటలు ఏమయ్యాయ్..?:
2014లో టీడీపీది ఒక దొంగ ప్రభుత్వం…లోకేశ్ వేల కోట్లు దోచేశాడు..చంద్రబాబు లాంటి దిక్కుమాలిన నాయకుడు లేడన్నావ్. ఈ రోజు చంద్రబాబు ఏం సంస్కరించబడ్డాడని అతనికి ప్రభుత్వాన్ని అప్పజెప్పాలి అంటున్నావ్.స్టీల్ ప్లాంట్ కార్మికులు చేయెత్తమంటే ఒకరూ ఎత్తలేదట..అందుకే ఉద్యమాన్ని వదిలేశాడట.మోడీని స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే నీకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇచ్చాను…మళ్లీ అడుగుతావేంటి అన్నాడట.అసలు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉందా..?
మేం కోరుకునేదీ అదే..ముసుగు తొలగించండి:
వైఎస్సార్సీపీ ఏది కోరుకుంటుందో అది జరగదని ఓ పెద్ద మనిషి అంటున్నాడు.మేం కోరుకునేది కూడా మీరు కలిసి రావాలనే..మీరు అలా కలిసి వస్తేనే కదా జగన్మోహన్‌రెడ్డి గారిపై ప్రజల గుండెల్లో ఎంత బలం ఉందో తెలుస్తుంది..?