– అదానికి దేశ సంపదను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకుందామా.?
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ప్రజలకు చెందిన దేశ సంపద, వనరులు, ఆస్తులను ప్రధాని మోడీ టోనీ క్యాప్ లిస్టులకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలను రాజకీయమంటూ బిజెపి అనేకమార్లు ఖండించింది. నీతి నిజాయితీ కలిగిన అమెరికా ఏజెన్సీ Hindenberg ఆదాని దేశ సంపదను డ్యూటీ చేయడంతో పాటు ప్రపంచాన్ని సైతం మోసం చేస్తున్నాడని ఆర్థిక నేరం గుట్టును బట్టబయలు చేసిన తర్వాత ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడం లేదు. పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ అనేకమార్లు ప్రస్తావించిన మాటలే నిజమయ్యాయి.ఆదాని ఆర్థిక నేరం గుట్టును Hindenberg ప్రచురించిన కథనంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది ఆర్థిక నిపుణులు ప్రజలు ఆందోళన చెందారు.దేశ సంపద వనరులు ఆస్తులు ప్రజలకు చెందాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నది.
ఆదాని ఆర్థిక నేరం భారతదేశంలో అతిపెద్ద స్కాం
ఆదాని సంస్థనే కంపెనీ పెట్టి వారి సంస్థకు సంబంధించిన ప్రతినిధులే షేర్ల విలువను వెయ్యిరెట్లకు పెంచి కొనుగోలు చేసి బ్యాంకులో తాకట్టు పెట్టి ప్రజల సంపదను దోచుకున్నారు. ఆదాని షేర్ లకు వ్యాల్యూ లేదు. బ్యాంకులకు ఇచ్చిన సెక్యూరిటీ పనికిరాదు.బ్యాంకులు, ఎల్ఐసి, సి పోర్ట్ ,ఎయిర్ పోర్ట్, రక్షణ శాఖకు సంబంధించిన సంపదను సైతం ప్రధాని మోడీ ఆదానికి దోచిపెట్టడం వల్లే ప్రపంచంలో రెండో కుబేరుడుగా ఎదిగాడు.ఆదాని ఆర్థిక నేరం గురించి మాట్లాడటం దేశం పైన దాడి అన్నట్టుగా బిజెపి వ్యవహరించడం తగదు. ఆదాని గురించి మాట్లాడిన మాటలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడం ఇదెక్కడి న్యాయం?దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా నవభారత నిర్మాణం చేసిన పండిట్ లాల్ నెహ్రూ వారసుడిగా రాజీవ్ గాంధీ ఆలోచనల మేరకు ఏఐసీసీ అధ్యక్షులు కరిగే నాయకత్వంలో ఈ దేశ వనరులు సంస్థలు వ్యవస్థలు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమై రోడ్లపైకి వచ్చింది.