హిందూ నాయకులను హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ )తో పాటు మరిన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇటీవల రాజస్థాన్, మహారాష్ట్ర, నిన్నగాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో హిందూ నాయకులను పిఎఫ్ఐ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, సహకార్యదర్శులు రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, శశిధర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విలేకరులతో మాట్లాడారు. నిజాంబాద్ కేంద్రంగా పిఎఫ్ఐ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్న 200 మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
హిందువులను చంపితే గాని పోలీసులు స్పందించ లేరా..? అని వారు నిలదీశారు. రాష్ట్రంలో విధ్వంసకర శక్తులు చెలరేగిపోతున్న కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తులు కార్యకలాపాలు విస్తరించిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు , దుర్గామాత వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉగ్రవాదులు హత్యలు చేసి, హైదరాబాదులో తలదాచుకుంటున్నారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఉగ్రవాదులు వచ్చి హైదరాబాదులో తల దాచుకుంటున్నా కూడా పోలీసులు, నిఘా వ్యవస్థ పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. హిందువుల పండుగ లపై రాష్ట్ర ప్రభుత్వం కాంక్షలు విధించడం సరికాదని హితవు పలికారు. హిందూ పండుగ లపై ఆంక్షలు విధిస్తే విశ్వహిందూ పరిషత్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. బోనాలు , బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరానికి ప్రతీక అని గుర్తు చేశారు. ప్రతి హిందువు తమ ఇష్టదైవాలను భద్రతలతో పూజించుకోవాలని ఎటువంటి ఆటంకాలు ఎదురైనా విశ్వహిందూ పరిషత్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని వరుట్ ప్రభుత్వాన్ని కోరారు.