జేబు దొంగ రేవంత్ రెడ్డి

– వెంట్రుక కూడా పీకలేడు
– ఎన్నికల తర్వాత బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే
– అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడేభాయ్ మోడీ అంటున్నడు రేవంత్ రెడ్డి
– రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదు
– 2500 కోట్లను డీల్లీకి రేవంత్ రెడ్డి పంపిండు
– జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డిపై విరుచుపడిన కేటీఆర్
– బిజెపి మా పార్టీపై పగ పట్టింది,
– సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– హాజరైన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు

ఈ రోజు కాంగ్రెస్ కు బిజెని అపే దమ్ము లేదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి విచిత్రంగా ఉంది, ఇక్కడున్నది బిజెపి ఉన్నట్లు ఉంది. అక్కడ రాహుల్ గాందీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటారు. అక్కడ అదానీ మంచోడు కాదు అంటే, రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడు అక్కడ రాహుల్ గాందీ, గుజరాత్ మాడల్ దుర్మార్గం అంటే, ఇక్కడ మా బడేభాయ్ మాడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు .

పార్లమెంట్ ఎన్నికల తర్వతా బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో 40 సీట్లు దాటదు. ఎన్నిసార్లు ఆయన ఎన్నికల తర్వాత బిజెపిలోకి వెళ్తారని విమర్శలు చేస్తే.. అనవసరమైన పైన వాటి పైన అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వాటి పైన స్పందించలేదు. నా జీవితమంతా కాంగ్రెస్ లో ఉంటా అని ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత తన మనుషులతో బిజెపిలో చేరుతారు.

ఒకవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్ల పైన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బిల్డర్లను బెదిరించడం, రియల్టర్లను బెదిరించడం లాంటి వార్తలన్ని బయటకు రాకుండా స్కామ్ ల పేరు చెప్పి, ఈ వార్తలనే టీవీలలో తిప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్ లకు అనుమతులు ఇవ్వడం లేదు?డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని, ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడటం లేదు, రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడు. ఈసుంటోడు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కరెంటు ఇయ్యడానికి, రైతుబంధు ఇయ్యడానికి, మహిళా మణులకు 2500 ఇయ్యడానికి, 4000 పెన్షన్లు ఇయ్యడానికి చేతకాదు. కానీ ఇవన్నీ కవర్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాపిచ్చుకుంటున్నాడు.

నీ చేతులలో అధికారం ఉంది కదా ఏం చేస్తావో చెయ్… ఎవరెవరు, తప్పులు చేసినా వాళ్ళ పైన చర్యలు తీసుకో . రేవంత్ రెడ్డికి భయపడే వారు లేరు, వెంట్రుక కూడా పీకలేడు. ఆయనకు ముఖ్యమంత్రిగా అసలు పని చేసే తెలివి లేదు.

రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు పేరు. 24 ఏండ్ల నుంచి పార్టీకి నగరంలో అండగా ఉన్నారు. పద్మారావు పోటీ చేస్తున్నారనగానే పార్టీ గెలుస్తుందని అందరు చేప్తున్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవాళ్లే నాయకులు.

దానం నాగేందర్ పార్టీ వదిలిపోయారు, రాజకీయాల్లో హత్యలుండవు, అత్మహత్యలు ఉంటాయి. ఆయన నిర్ణయం తప్పు అని ఎన్నికల్లో గెలిచి మనం చూపించాలి. ఆయన అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్ళాడు, ఖైరతాబాద్ ప్రజలే మన పార్టీని గెలిపించి, ఆయన నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం నాకున్నది.

నాగేందర్ అవకాశవాద రాజకీయాల కోసం వెళ్ళిండు అని అందరూ అంటున్నారు. గతంలో ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు కూడా మంచిది కాదని దానం విషయంలో అర్థం అవుతుంది.

స్పీకర్ దానం నాగేందర్ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అవసరం అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి అనర్హుడిగా ప్రకటించేలా చేస్తాం. మూడు నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి సిద్ధంగా ఉండాలి. ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలి.సికింద్రాబాద్ లో మన పోటీ కాంగ్రెస్తో లేనేలేదు, దానం నాగేందర్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు

గతంలో అంబర్ పేట లో ఓడిపోతే అదృష్టవశాత్తు సికింద్రాబాద్ ఎంపీ అయిండు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన అతిపెద్ద మూడు పనులు… కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్మండిలో రైల్వే లిఫ్ట్ ఓపెన్ చేయడం, సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడం. ఇవే కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసిన గొప్ప సేవ.

ఆయన సొంత నియోజకవర్గం అంబర్ పేట లో ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించండి అంటే ఇంకా నాన్చుతూనే ఉన్నారు.మనం మాత్రం 36 ప్లై ఒవర్ లు పూర్తి చేసినం. కిషన్ రెడ్డికి ఓటేసేందుకు ఒక్క కారణం లేదు. హైదరాబాద్ నగరం బిఅర్ఎస్ కు కోటగా మారింది. బిజెపి, బిఅర్ఎస్ అనే మాటను నగర ప్రజలు నమ్మలేదు, అందుకే క్లీన్ స్వీప్ చేసినం.

బిజెపి రాముడి అడ్డుపెట్టుకుని చేస్తున్న నాటకాన్ని ప్రజలు గమనించాలి. కిషన్ రెడ్డికి దమ్ముంటే లిక్కర్ స్కాంలో ఏముందో కోర్టుకు చెప్పాలి, కిషన్ రెడ్డి ఏం చేసిండో చెప్పి ఓటు అడగాలి. ఈరోజు సికంద్రబాద్ లో పోటీ ఒక విఫల ఎంపి కిషన్ రెడ్డికి, అవకాశవాద యంఏల్యే దానంకు, ఇంకోవైపు నిబద్దత కలిగిన పద్మారావుల మద్య ఉన్నది.

అరోజు కవితమ్మను అరెస్టు చేయలేదు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఈ రోజు ఏం అంటుంది? సుప్రీం కోర్టులో కేసుంది కాబట్టే అరెస్ట్ చేయలేదు, కానీ ఈరోజు బిజెపి మా పార్టీపై పగ పట్టింది,

బిజెపికి రాముని పై పట్టా ఏం లేదు: ఎమ్మెల్యే పద్మారావు
పార్టీకి ఉద్యమాలు పోరాటాలు కొత్తకాదు, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ విధానాల పైన పోరాడుతాం. పార్టీ శ్రేణులను పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోతా. కార్యకర్తలకు ఏ కష్టం కలిగిన నగరంలోని ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉంటాడు. లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలు నాయకుల కృషి, శ్రమ, త్యాగం వల్లనే ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ పరిస్థితిలో ఉంది.

అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ, 10 సంవత్సరాల పాటు హైదరాబాదు నగరాన్ని తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసింది. అవసరమైతే రానున్న ఐదు సంవత్సరాలపాటు ప్రతిపక్షంగా ఉండి ప్రజల తరఫున పోరాడుతాం.

కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం చేసింది ఏం లేదు… ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ నగరానికి అదనంగా తీసుకురాలేదు. ఎవరి మతాలకు వాళ్లు పూజలు చేసుకుంటారు. పండుగలు నిర్వహించుకుంటారు. కానీ బిజెపికి రాముని పై పట్టా లేదు. మేమందరం కూడా హిందువులమే. కేవలం బిజెపి మాత్రమే హిందువుల అన్నట్లు చెప్పుకుంటుంది.

కెసిఆర్ చెప్తే సికింద్రాబాద్ లోనే కాదు ఢిల్లీలో వెళ్లి కూడా కొట్లాడే దమ్ము మాకుంది.మాకు కెసిఆర్ పైన అంత నమ్మకం ఉంది. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన మాకు, ఈ పార్లమెంటు ఎన్నికలు ఒక లెక్క కాదు. ఈ ఎన్నికలలో బలంగా గెలుస్తాం. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. ఈ ఎన్నికల్లో బిసిలకు పార్టీ అధికంగా అవకాశం ఇచ్చింది.

Leave a Reply