– పోలీస్ వ్యవస్థ అధికారపార్టీ పెద్దలకు అమ్ముడుపోయింది.
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
రాష్ట్రంలో అద్దె లాఠీలు ప్రజల తలలు పగలగొడుతున్నాయి. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ పెద్దలకు అమ్ముడుపోయింది. పోలీస్ బాస్ లు చెప్పినట్లు లాఠీలు ప్రజల తలలపై రక్తపు నాట్యం చేస్తున్నాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తమ ఆంక్షాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పని చేస్తున్నప్పుడు ప్రజా ఉద్యమం తీవ్రంగా వస్తుంది. అలాంటి ఉద్యమమే అమరావతి రాజధాని ఉద్యమం. భూములిచ్చిన రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రాష్ట్ర భవిష్యత్ కోసం పవిత్ర మహాపాదయాత్ర చేయదలిస్తే ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది.
ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొని కోర్టు ద్వారా అనుమతితో శాంతి యుత పాదయాత్ర చేస్తున్న రైతులపై ప్రజలపై అమ్ముడుపోయిన అధికారులు వారి కింది స్థాయి సాధారణ పోలీసులతో చట్ట వ్యతిరేకంగా ఉద్యమకారుల తలల పగలకొడుతున్నారు. ప్రజా ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం అరాచకంగా అణచివేయాలని చూస్తుంది. దీని కోసం వైసీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేస్తూ ప్రతిపక్షాలపై, ప్రజలపై దాడులకు బెదిరింపులకు పూనుకుంటుంది. నిన్న అనంతపురంలో విద్యార్ధుల తలలపై రక్తపు నాట్యం చేసిన లాఠీలు నేడు అమరావతి రైతుల, ప్రజల కాళ్లపై ముళ్ల కంచలు వేసి లాఠీలతో విచక్షణంగా కొడుతూ అణచివేసి పారిపొమ్మని చెబుతున్నారు.
ఉద్యమాలు ఎప్పుడూ పారిపోవు. వైసీపీ కార్యకర్తల దాడుల సందర్బంగా జరిగిన ఘటనల్లో పోలీసులను ప్రవేశపెట్టి, అక్రమ కేసులు పెట్టించడం, స్టేషన్లలో పెట్టి వేధించడం వంటి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక దౌర్జన్యాలపై కోర్టులను ఆశ్రయించిన వారిని మరింతగా పోలీస్ వ్యవస్థ ద్వారా అణచివేస్తుంది. పోలీస్ వ్యవస్థ బానిసత్వ పరాకాష్టే అమరావతి రాజధాని ఉద్యమకారులపై లాఠీ చార్జ్. వైసీపీ అధికారంలో రావడానికి రాజధాని అమరావతే అని చెప్పి గెలిచి తరువాత రాజధాని రంకును అంటగట్టి విచ్చిన్నం చేయడం దారుణం.
రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఇది తీవ్ర ప్రమాదకరం. అన్ని రకాలు ప్రజలు విసిగిపోయాయి. మరిన్ని అద్దె లాఠీలు కావాలి. అద్దె లాఠీలతో ప్రజా ఉద్యమాన్ని నియంత ప్రభుత్వాలు అణచలేవు. పోలీసులు అభాసుపాలు, ప్రభుత్వం అధోగతిపాలు, జగన్ రెడ్డి జైలు పాలు అవ్వవని తెలియజేస్తున్నాం.