ఈమధ్య సైబర్ నేరగాళ్ళు భారతీయ వృద్ధ మేధావులను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేసి లేని అధికారాన్ని ఉపయోగించి, వారిని దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు స్కామ్‌లో చిక్కుకున్న వృద్ధులు ఇటీవలి నెలల్లో ఎక్కువగా ఉన్నారు. భారతదేశం అంతటా కొత్త రకమైన ఈ సైబర్ నేరాలు వ్యాపించాయి.
“డిజిటల్ అరెస్టులు” ద్వారా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, బాధితుల డబ్బు మరియు మానసిక ప్రశాంతతను దోచుకోవడానికి భయాన్ని మరియు సాంకేతికతను ఉపయోగించి వ్యూహం పన్నుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది వ్యక్తులు ఈ స్కామ్‌లో చిక్కుకుంటున్నారు. ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తరపున వచ్చిన వ్యక్తిగా ఫోన్ కాల్‌తో ప్రారంభ మవుతుంది. తరువాత ఒక CBI అధికారిలా మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపిస్తారు. వారాల తరబడి రోజువారీ సందేశాలు పంపుతారు. తరువాత కఠినమైన వీడియో నిఘా నిర్వహించబడింది.
ఇది వారి ప్రతి కదలికను, నివేదించబడుతుందని బెదిరిస్తారు. పెద్ద మొత్తంలో డబ్బును, వారి పేర్లు క్లియర్ అయిన తర్వాత వారు దానిని తిరిగి పొందుతారని హామీ ఇచ్చి, వివిధ ఖాతాలకు బదిలీ చేయాలని వారికి సూచించ బడుతుంది. వారు ఒక స్కామ్ బాధితులని గ్రహించే సమయానికి, వారు వీలైనంత ఎక్కువ డబ్బును బదిలీ చేయించు కుంటారు. సైబర్నేరస్థులు భయాన్ని మరియు లేని అధికారాన్ని ఉపయోగించి వృద్ధ జంటలను మానసికంగా జైలులో పెడతారు.
వారి ఆర్థిక విధ్వంసంలో వారిని భాగస్వాములను చేస్తారు. భయం మరియు సాంకేతికత కలిసి బలహీనులైన సీనియర్ సిటిజన్లను మోసం చేసే విధంగా భారతదేశం అంతటా పెద్ద ఎత్తున ఈ స్కామ్ నిరాటంకంగా భయం లేకుండా సైబర్నేరగాళ్ళు నిర్వహించడం జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసా? 2024లో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో వృద్ధ బాధితుల నుండి 1.9 బిలియన్ రూపాయలకు పైగా దొంగిలించబడ్డాయి.
దయచేసి సైబర్ మోసం సంఘటనలను నివేదించడానికి 1930 కి గాని 155260 కి గాని డయల్ చేయండి. మీ ఫిర్యాదును cybercrime.gov.in లో నమోదు చేయండి. తెలియని వ్యక్తుల నుండి వచ్చిన పోన్ కాల్స్ గాని సందేశాలకు గాని స్పందించకండి.
– ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ క్యాన్సర్ జనరల్ హాస్పిటల్
విశాఖపట్నం