సీయమ్ అవ్వాలన్న కోరిక..తీరిన తర్వాత కూడా జగన్ సంతోషంగా లేరు..
చేజిక్కిన అధికారాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు..సీయమ్ పీఠం దక్కిన తర్వాత…తిరుగులేని అధికారం చేజిక్కిన తర్వాత..సహజంగానే ఆయన స్వభావరీత్యా ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు.
ఇంకా చెప్పాలంటే ..చట్టాన్ని ధిక్కరించి ..వ్యవస్దలను చెరబట్టి మరీ వేధించారు.అయితే …దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి…అభివృద్ధి..సుపరిపాలన మీద దృష్ఠి సారించాల్సి ఉంది…ప్రజల మెప్పు పొందాల్సి ఉంది కానీ అలా జరగటం లేదు.
ప్రశాంత్ కిశోరు..కులాల కుంపట్లు..పింక్ డైమండ్లు..ఇన్ సైడర్ ట్రేడింగు..భ్రమరావతి లాంటి ప్రేలాపనలు..అనుకూల ప్రచారసాధనాలు..అసత్య ప్రచారాలు.వీటి వెనుక ఉన్న పెద్ద మనుషుల యంత్ర తంత్ర గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ ప్రయోగించారు.
వారు కూడా పాలకులే!
లేకపోతే..!
మిఠాయి పొట్లంలా అమరావతి వేల ఎకరాల మీద అజమాయిషీ వచ్చింది..ఆడుతూ పాడుతూ పూర్తిచెయ్యవచ్చు.
మూడొంతులు పూర్తయిన పోలవరం ..చకచకా మిగతా పని ముగించి..రిబ్బన్ కట్ చేసి..తన చేతిలోని అబద్దాల మీడియా తో ఊదరగొట్టవచ్చు.
ఇసుక …మద్యం లాంటి వాటి లో కక్కుర్తి పడినా..రాష్ట్రాలకొచ్చిన పెట్టుబడులను వెళ్ళగొట్టవలసిన అవసరం లేదు.
ఒక రకంగా చంద్రబాబు బాట పరిచారు..దానిమీద అలవోక గా వెళ్ళి..జగన్ అనుకున్న విధంగా ముఫ్పై ఏళ్ళు కాకపోయినా మళ్ళీ ఇంకొక సారి అని అడగవచ్చు.జనం కూడా నో చెప్పలేరు.
మరి ఎందుకో జగన్ చంద్రబాబు ని తిట్టిస్తూ..విధ్వంసకర విన్యాసాలు చేస్తూ..కూర్చున్న కొమ్మనెందుకు నరుక్కుంటున్నారు.
హోదా అడగరు..అడగలేరు .నిధులు అడగరు..విభజన హామీల ఊసు ఎత్తరు…ఎత్తలేరు.
రైల్వే జోన్ గురించి అసలు మాట్లాడరు.
గెలిపించింది ఎవరో బాగా తెలుసు కాబట్టి..ఎలా గెలిపించారో తెలుసు కాబట్టి..అప్పులు మాత్రం అడుగుతారు..!
మళ్ళీ ఇంకోసారి కూడా అవసరమైతే అండగా నిలుస్తారన్న ఆశ ఉంది కాబట్టి.
తెర వెనుక పెద్ద మనుషులకు అమరావతి ఉండ కూడదు…ఆ ప్రాజెక్టు అటకెక్కాలి..పోలవరం పని జరగకూడదు…పెట్టుబడులు రాకూడదు..ఉన్నవి జారుకోవాలి..చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చినా …ఏమీ చెయ్యలేని పరిస్దితుల్లో పెట్టేస్తున్నారు..!
మూడేళ్ళకే మూటముల్లే సర్దేసే పరిస్థితి వచ్చింది.నాలుగేళ్లకు పరాజయం ఖాయమయింది.
పక్కన ఆయన రెక్క తెగింది.
ఆయనే ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
రిటన్ గిఫ్ట్ అందుకోవటానికి సిద్దమవుతున్నాడు.
పైవాడు..ప్రస్తుతానికి అందుకున్న పొట్లాలకు తగ్గట్టు తల ఊపతున్నారు. ఊపటం ఎప్పుడో ఒకప్పుడు మానేసాలా ఉన్నారు.దిన దిన గండం నూరేళ్ళాయుస్సు! మనసు స్దిరంగా ఉండటం లేదు..!
తన కుతి..తన కక్ష తీరుతూ ఉండవచ్చు..కాని కళ్ళ ముందు సర్వనాశనం అయిపోవటం మనిషి జన్మ ఎత్తిన వాడు..స్వరాష్ట్రాన్ని నాశనం చేసుకోడు..
రాష్ట్ర అభివృద్ధి..పురోగమనానికి..ఆర్దిక పరిపుష్టికి అడ్డుపడే చర్యలన్నీ …పాతాళానికి నెట్టేవే!
దోచి దాచిన దుడ్డు..మాత్రం పుష్కలంగా ఉన్నది.ఈడీ గెద్ద ఎప్పుడు వచ్చి వాలుతుందో..అంతేవాసులు..ఇంతే సంగతులు చిత్తగించవలెను అంటారో అన్న గుబులు ఉండనే ఉన్నది.
జగన్ వారికున్న కేసుల ఇబ్బంది వల్ల సహజంగానే ఎదురు తిరగ లేరు..దానికి తోడు ఎన్నికల్లో వారి సహాయం కూడా అనుక్షణం గుర్తుకు వస్తుంటుంది.
మితిమీరిన అరాచకం తో తనకండగా నిలిచిన వారిని దూరం చేసుకున్నారు.
జనంతో పనేముంది..పెద్దలతో సఖ్యత గా ఉంటే..బయట ఉండవచ్చు..మళ్ళీ మళ్ళీ గెలవచ్చు..!
రత్నాలు మెరుస్తాయి..ఆ వెలుతురులో దాటేయవచ్చనుకుంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత.. జనాగ్రహం చాప కింద నీరులా చుట్టుముడుతుంది.
మొఖం లో మందహాసం కరువైపోయింది..విక్టిమ్ కార్డు వాడినా..సానుభూతి మంత్రం పఠించినా ఫలించేలా లేదు.
పైవాడి అండ ..నో గ్యారంటీ.
పక్కవారి సీను తేడాగా ఉంది.
జనమేమో పారిపోతున్నారు గేట్లు దూకి..
క్రూర రాజకీయం తప్ప వేరే దారి లేదు..
అదీ కుదరకపోవచ్చు
– అడకత్తెరలో పోకచెక్క !
– రమాదేవి