Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్ధులు, మీడియాపై పోలీసుల దౌర్జన్యం దారుణం

-విద్యార్ధి నేతల గొంతు నులిమిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి
-రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు డిమాండ్‌

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న యువత విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయటంతో పాటు గొంతు నులుముతు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ గుంటూరు స్పెషల్ బ్రాంచ్ సి ఐ ఎమ్ .శ్రీనివాస్ ను అలాగే మీడియా ప్రతినిధులపైన దాష్టికాన్ని చేసి మేడికొండూరు సి ఐ అల్తాఫ్ హుస్సేన్ల పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ డిమాండ్ చేస్తూ ఖండించారు.

జాబు క్యాలెండరు కోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చెయ్యాలని కోరుతూ తెలుగుయువత ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుతో పాటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న యువత విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రికత్త కు దారితీసింది.గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ను ఉద్దేశపూర్వకంగా ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేసి దాష్టికానికి పాల్పడటం దారుణం.

చొక్కాలు గొంతుకు మెలేసి ఈడ్చుకెళ్లటమే కాక వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ ఎస్బి సి ఐ ఎమ్ .శ్రీనివాస్ అరాచకాన్ని ఖండించిన రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు . వెంటనే పోలీసు శాఖ స్పందించి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకొని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

LEAVE A RESPONSE