3000 బైకులతో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ర్యాలీ

Spread the love

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ తెలంగాణ 75వ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలో 16, 17, 18 తేదీలలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులుకేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు, ధముంటే వారు పాలించే రాష్ట్రలో ఈ దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, వంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాసీం, షైక్పేట్ ఎం ఆర్ ఓ రామకృష్ణ, స్తానిక కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, సి ఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంజీవ, ప్రదీప్, అప్పు ఖాన్, సంతోష్ ముదిరాజ్, కృష్ణమోహన్, మన్సూర్, సీనియర్ నాయకులు విజయకుమార్, తన్ను ఖాన్, చిన్న రమేష్, సిరాజ్, విజయ్ సింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply