సినిమాల్లో హీరో చిరుతపులితో ఒంటిచేత్తో ఫైట్ చేస్తాడు. చివరాఖరకు దాన్ని చంపడమో, దారికితీసుకురావడమో చేస్తాడు. కానీ హర్యానా పోలీసులు హటాత్తుగా వచ్చిన చితరుపులితో రియల్ ఫైట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. శహభాష్ పోలీస్.
పోలీసులంటే ఎలాంటి సమయాల్లోనైనా ఆదుకుంటారని ప్రజలకు ఒక నమ్మకం. ఎంత క్లిష్ట సమస్య ఎదురైన ధైర్యంగా ముందుండి
నిలబడతారనే ఒక విశ్వాసం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హర్యానలో చోటుచేసుకుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో పోరాడారు. వివరాల ప్రకారం.. హర్యానా పానిపట్‌లోని బెహ్రాంపూర్ గ్రామంలోకి ఓ చిరుత పులి వచ్చింది.
దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. పులిని బంధించేందుకు ముగ్గురు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిరుతను బంధించే ఈ అపరేషన్‌లో.. చిరుత పోలీసులపై దాడి చేసింది. దీనితో గాయపడ్డ అధికారులు వెంటనే.. చిరుతను శాంతింపజేశారు. పులిని బంధించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ట్వీట్టర్ వేదికగా ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల తెగువకు ప్రశంసలు కురిపిస్తున్నారు.