– మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు
మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి గం.11.30. లకు సోషల్ మీడియా యాక్ట్విస్టు వెంకటేష్ ని, 30-06-2022 ఉదయం గం.6-00లకు దౌర్జన్యంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళడం మానవ హక్కులను ఉల్లఘించడమే. పోలీసులు దొంగల్లా మారారు. వారి ప్రవర్తన దొంగలను తలపించేల ఉంది. థరణి కోటలో వెంకటేష్ ఇంటిలోకి ఐదుగురు పోలీసుల్లో ఇద్దరు పోలీసులు గోడ దూకి వెళ్లి అరాచకం సృష్టించారు. ముగ్గురు గేటు దగ్గర ఉండి నానా రభస చేశారు. దీనిని గమనించిన వెంకటేష్ చెల్లి వీడియో తీస్తుంటే ఫోనుని లాక్కొని పగలగొట్టడం అన్యాయం.
ఇంట్లో ఉన్న ట్యూబు లైట్లు, బల్పులను పగలకొట్టి దోపిడికి వచ్చిన దొంగల్లాగ ప్రవర్తించారు. అక్కడ ఉన్న హార్డ్ డిస్కును కూడా పగలగొట్టారు. మీరు ఏం పని చేస్తారు, మీరు ఎవరని వారి తల్లి ప్రశ్నిస్తే ఆమెను కూడా కొట్టడం జరిగింది. వెంట్రావు గదిని పగలగొట్టి అక్కడ ఉన్న వస్తువులన్నిటిని ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. మానవ సమాజం తలదించుకొనే విధంగా పోలీసులు ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. ఈ రాక్షస పాలనలో పోలీసులు మాదే పెత్తనం అనే విధంగా భావిస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేదు.
తెలుగుదేశం నాయకులు ప్రశ్నస్తే అతనికి 41ఎ నోటిసు ఇవ్వడానికి వెళ్ళాం, అతను తలుపులు తెరవ లేదు. అందువల్లనే మేము ఆ పని చేశాం. పోలీసులు బరితెగించి ప్రజాస్వామ్య వ్యవస్ధకి తిలోదకాలు పలికారు. మీరు నోటిసు ఇవ్వాలనుకుంటే ఫోను తీసుకెల్లమంటే వచ్చి తీసుకుంటారు, లేదా కానిస్టేబులుకు ఇచ్చి పంపించినా తీసుకుంటారు. ఒక్క నోటిసు ఇవ్వడానికి ఐదు మంది పోలీసులు అర్థరాత్రి వెళ్ళాలా?
సాంబశివరావు అనే వ్యక్తితో వెంకటేష్ తన ఇంటి వద్ద పోలీసులు చేసిన ధ్వంసం గురించి చెప్తే ఫోన్ నెంబరు ఆధారంగా అతనిని కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ పెట్టారు? ఏ సెక్షన్ మీద కేసు పెట్టారు, ఏ స్టేషనులో యఫ్ఐఆర్ రిజిష్టరు అయింది చెప్పలేదు. తరువాత ఇచ్చిన సమాచారం ప్రకారం మంగళగిరి సిబిఐ స్టేషనులో కేసు రిజిష్టరు అయింది. ముందు ముద్దాయిలని పట్టుకు రావడం అర్థరహితం. ఆ తరువాత కేసు రిజిష్టరు చేయడమేంటి?.
ప్రజాస్వామ్య వ్వవస్థలో ఒక పద్ధతి ఉంది. కేసు రిజిష్టరు అయిన తరువాతనే విచారణ ఉంటుంది, విచారణకు వచ్చిన తరువాతనే నోటిసును పంపిచాలి. ఈ దౌర్జన్యకాండ ఎవరు చప్తే చేశారో, దీని వెనుక ఉన్న వాళ్లకు కూడ సరియైన పరిహారం త్వరలోనే జరుగుతుంది. ఈ విధంగా ప్రవర్తించిన పోలీసులు వారి మీద చర్యలను తీసుకోవాలని న్యాయం స్థానాన్ని కోరుతున్నారు. వెంకటేష్ కుటుంబ సభ్యులు కూడ రిజిష్టరు పోస్టు చేసి కేసు పెట్టడం జరిగింది. వారి వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు వివరించారు.