Suryaa.co.in

Telangana

టిఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం

– ఈటల రాజేందర్
తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ చర్చ జరుగుతోందని.. కేసీఆర్ పెత్తనానికి నాంది పలికే గద్దె హుజురాబాద్ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జోగిపేట సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నోట్ల కట్టలకు.. కేసీఆర్ మద్యానికి కేసీఆర్ కుక్కలకు చరమగీతం పాడే రోజులు వచ్చాయన్నారు.
ఇరవై ఏండ్లు తెలంగాణ ప్రజల్ని బానుసత్వంలో ఉంచాలని చేస్తుండ్రు..దమ్ముంటే రా కేసీఆర్, హరీష్ రావు నాతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎనికల్లో టిఆర్ఎస్ గెలిస్తే రాజాకీయా సన్యాసం తీసుకుంటానని తెలిపారు. హుజురాబాద్ తో సహా తెలంగాణలో 2023 ఎన్నికల్లో కషాయం జెండా ఎగురుతుందన్నారు. ఏడు సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇండియా టుడే సర్వేలో 84 శాతం జనాలు వ్యతిరేకంగా ఉన్నారని, 2023 లో కేసీఆర్ ఆనాడు ప్రజల్ని నమ్మిండు.. ఈనాడు ఆత్మగౌరవం విడిచి డబ్బును నమ్ముకొని పాలన చేస్తుండని విమర్శించారు.

LEAVE A RESPONSE