Suryaa.co.in

Telangana

తెరాసకు రాజకీయాలు ముఖ్యం కాదు

-తెలంగాణా అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం
-సంకల్ప సిద్ధికి ఆ 18,000 కోట్లు మంజూరు చెయ్యండి
-ఒక వ్యక్తికి కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తాం
-ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటాం
-ఉప ఎన్నికలు తెచ్చిందే బిజెపి ఉనికి కోసమే కదా
-రాజగోపాల్ కిచ్చిన 18,000 కోట్లు నియోజకవర్గ అభివృద్డికై ఖర్చు పెట్టండి
-అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తుంది
-బరి నుంచి టి ఆర్ యస్ తప్పుకోవడం ద్వారా మీకు ఒక సీటు వచ్జినట్లు ఉంటుంది
-మోదీ, అమిత్ షాలు ఇప్పటికైనా స్పందించాలి
-నియోజకవర్గ అభివృద్ధికి 18,000కోట్లు మంజూరు చేస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం
-ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాధేయపడి ఒప్పిస్తాం
-మంత్రి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటన

ఇప్పర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయాలు ముఖ్యం కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. ఆ సంకల్ప సిద్ధికై రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆ 18000 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కి మంజూరు చేస్తే బరిలో నుండి తప్పుకోవడానికి ఇప్పటికీ సిద్ధమే నని మంత్రి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ఇప్పర్తి,జక్కలివారి గూడెం,రాయిగూడెం తదితర గ్రామాల్లో టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి ప్రచారం నిర్వహించారు.నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ,మునుగోడు యం పి పి లింగస్వామి ,మండల టి ఆర్ యస్ అధ్యక్షుడు బండా పురుషోత్తం రెడ్డి జడ్ పి టి సి స్వరూప రాణి రవీందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మేము విసిరిన సవాల్ కు ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.దక్షిణ తెలంగాణా లో ప్రాపకం కోసమే కదా బిజెపి మునుగోడు కు ఉప ఎన్నికలు తెచ్చిందని ఆయన దుయ్యబట్టారు. కుట్రలు కుతంత్రాలతో బిజెపి తెచ్చిన ఉప ఎన్నికల్లో వారు ఆశించింది నేర వేరాలి అంటే ఒక వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన 18,000 కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తే దక్షిణ తెలంగాణా లో బిజెపి కి ఒక సిటు కావాలన్న ఆశనెరవేరుతుంది.నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరినట్లుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధేయపడైనా ఒప్పిస్తాం, వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత అభివృద్దా, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్న తెలంగాణా రాష్ట్ర అభివృద్దా అన్నది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లే తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆరుదశబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం సస్యశ్యామలంగామారడంతోటే బిజెపి కి ఈ దుర్బుద్ధి ఏర్పడిందని ఆయన విరుచుకుపడ్డారు.ఏ ఒక్కరి ఊహకందని రీతిలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా, అదే వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతుబందు పథకంతో ఎకరాకు ఐదు వేలు చొప్పున సాలీనా 10 వేలు,సహజ మరణాలకు కుడా భీమా వర్తింప చెయ్యొచ్చని రైతుభీమా తో నిరూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ను తట్టుకోలేకనే బిజెపి ఈ కుయుక్తులకు పాల్పడి మునుగోడు ఉప ఎన్నికలు తెచ్చిందని ఆయన మండిపడ్డారు.

అంతే గాకుండా ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇస్తున్న ఫించన్ 600 మాత్రమే ఉండగా ఇక్కడ ఇస్తున్న ఆసరా ఫించన్లు, ఇక్కడి కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు వారిలో వణుకు పుట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. అటువంటి పథకాల కావాలన్న డిమాండ్ గుజరాత్ లో మొదలు కావడంతో తెలంగాణాలో అస్థిరత సృష్టించేందుకే మోదీ, అమిత్ షా ల ద్వయం ఉప ఎన్నికల రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దాడి మొదలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు.అదే గుజరాత్ లో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ కేవలం ఆరు గంటలు మాత్రమే నని,ఆ అరుగంటలు కుడా ఉచితం కాదని,నిలబెట్టి మీటర్ రీడింగ్ సరిపడా వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

అటువంటి రాష్ట్రం తో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ డిమాండ్ తీవ్రం కావడంతో ఇక్కడ కుడా మోటర్లకు మీటర్లు పెట్టేందుకు వీలుగా బిజెపి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రత్యేక చట్టాన్ని మన మీద రుద్దెంకు రూట్ మ్యాప్ రెడీ చేసిందన్నారు. అటువంటి పార్టీకి మునుగోడు ఉపఎన్నికలను వేదికగా మల్చుకొని బిజెపి కి గుణపాఠం చెప్పాలని ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE