-ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జగన్ మిత్రుడు పొంగులేటి
-ఇప్పటికే ఏపీలో పొంగులేటి కంపెనీకి పనులు
-మళ్లీ మరో ప్రాజెక్టు దక్కించుకున్న పొంగులేటి
-కాంగ్రెస్‌లో ఉన్నా జగన్‌తో సత్సంబంధాలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టును మాజీ వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. గత డిసెంబర్లో 1165 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవగా, ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తిరిగి ఏప్రిల్లో 1599.94 కోట్లతో రాఘవ కన్స్ట్రక్షన్ టెండర్ దక్కించుకుంది.
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన పొంగులేటి, తాజాగా రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ ఆయనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో, తాజాగా కాంగ్రెస్‌లో చేరారు.
అయితే పొంగులేటి రాజకీయంగా కాంగ్రెస్‌లో చేరినప్పటికీ.. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే జగన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుండటం విశేషం. తాజాగా మోదీ సర్కారుపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసాన్ని వైసీపీ వ్యతిరేకించింది. ఏపీలో అనేక ప్రాజెక్టులు కూడా జగన్ సర్కారు, తన మిత్రుడైన పొంగులేటికి కట్టబెట్టడం విశేషం.