Suryaa.co.in

Telangana

చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యకు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు

– ఈనెల 13 న రవీంద్ర భారతి వేదికగా సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం

హైదరాబాద్: రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు , కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు -2024 సంవత్సరానికి గాను, ప్రముఖ రచయిత కళాకారులను ఎంపిక చేయడానికి జ్యూరీ కమిటీ సమావేశం అయింది.

జ్యూరీ కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయులు, మాజీ కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడ భూషి శ్రీధర్ ,ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయిత్రి ఐనంపూడి శ్రీ లక్ష్మీ సమావేశంలో పాల్గొన్నారు.

ఫైనల్ గా రచయితల విభాగంలో ప్రముఖ సినీ గేయ రచయిత ,ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో బలగం ఫేం కొమురమ్మ మొగిలయ్య ను అవార్డు గ్రహీతలు గా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పేర్లతో కూడిన పత్రాన్ని కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొకరికి 51 వేల రూపాయల నగదు , మెమోంటో తో సత్కరించబడుతుందని కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు.

LEAVE A RESPONSE