Suryaa.co.in

Andhra Pradesh

ఏఏజీలా కాకుండా జగన్ ఏజెంట్‍లా పొన్నవోలు

-చంద్రబాబుకి బెయిల్ రావడాన్ని వైసీపీ నేతలు సహించలేకపోతున్నారు
– బెయిల్ ఇచ్చి హైకోర్టు పరిధి దాటిందన్న పొన్నవోలు వ్యాఖ్యలు దారుణం
– స్కిల్ కేసు నిందితులంతా బయటే ఉన్నారని తెలియదా?
– సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలడం ఖాయం
– ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వ వైఖరి
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి బెయిల్ ఇచ్చి హైకోర్టు పరిధి దాటిందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు దారుణం. న్యాయాధికారులు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నువ్వు మరియు సిఐడి డీజి సంజయ్ హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబు నేరం చేసాడు 370 కోట్లు కుంభకోణం వీళ్ళ ఖాతాల్లోకి వెళ్లాయి అని అడ్డగోలుగా మాట్లాడారు. చివరకు 27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాకు వెళ్లాయి అని చెప్పారు.

నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు లో వాదించు తప్పులేదు.17A మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఎవడికి వాడు గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఎవరు చెప్పకూడదా? నీకేమైనా పేటెంట్ ఇచ్చారా సుధాకర్ రెడ్డి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు మీద చిల్లర కేసులు పెడుతున్నారు. మద్యం డిసలరీలు కేటాయింపులలో అక్రమాలు అంట! రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం మీద ఎన్ని వేల కోట్లు పోగేస్తున్నాడో, నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.

ఉచిత ఇసుక పాలసీ తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని కేసు పెట్టారు. ఇసుక మీద అడ్డగోలుగా దోచుకుంటుంది ఎవరో అందరికీ తెలుసు మేము ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలు ఉంటే ఈరోజు అది 8వేల రూపాయలకు పెరిగింది. 8000 రూపాయలు ఉన్న లారీ ఇసుక ధర ఈరోజు 40,000 రూపాయలు అడ్డగోలుగా మీ తాడేపల్లి ప్యాలెస్ కి 40 వేల కోట్ల రూపాయలు మీ తాడేపల్లి ప్యాలెస్ కు ఇసుకలో వెళ్ళాయని చెప్పేసి మేము ఆధారాలతో నిరూపించాం.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయి 36 మంది బయట ఉన్నారు 53 రోజుల తర్వాత బెయిల్ వస్తే దానిమీద సుప్రీంకోర్టు కి అప్పీలు ఏమిటి? కేవలం మీ నాయకుడు జగన్ మెహన్ రెడ్డి కేసులలో బెయిల్ మీద బయట ఉన్నాడు… చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసులు పెట్టి మానసికంగా హింసించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ను ఆత్మ స్టైర్యం దెబ్బతీయాలి అనే పిచ్చి ఆలోచన తప్ప ఇందులో ఏమీ లేదు.

సుధాకర్ రెడ్డి లాంటి స్థాయి తక్కువ మనుషులు బజారుకు వచ్చి రోడ్లపై కేసుల గురించి మాట్లాడుతూ బ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈరోజు మీరు చేసిన తప్పులన్నిటికీ కూడా ఒకరోజు ఉంటుంది అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇంటింటికి వెళ్లి డేటా చౌర్యం చేస్తున్నారు అని అంటున్నాడు. చాలా హాస్యాస్పదంగా ఉంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది.

మేం డైరెక్ట్ గా వెళుతున్నాం ప్రతి ఇంటికి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు రైతులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది మీకు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లో భాగంగా మీకు ఈ పథకాలు వస్తాయి అని చెప్పి వారికి బాండ్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఓర్చుకోలేక పసుపు బ్యాచ్ అంట దొంగలు ముఠా అంట! ఎవరు దొంగలు ముఠా సజ్జల? ప్రజలకు తెలియదా ఏ అధికారం లేకుండానే మీ నాయకుడు 43 వేల కోట్లు కుంభకోణం చేసి 12 ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నాడని!

నువ్వు ఒక సలహాదారుడుగా పదవి సృష్టించుకుని, నీ కొడుకు ఏమో సోషల్ మీడియా అధ్యక్షుడు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించి వేధింపులు గురి చేయటం నువ్వు నీ కొడుకు చేస్తున్నారు. మేం ప్రజల్లోకి వెళుతూ ఉంటే వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టి అవాకులు చవాకులు పేలుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇంకా వంద రోజులు కచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళటం ఖాయం అని హెచ్చరిస్తున్నాను….

LEAVE A RESPONSE