(నాగ గురునాథ శర్మ)
మీ ఊళ్ళో క్యాస్ట్ ఫీలింగుందంటావా?
“నేనింత ఎదవనని తెలిశాక కూడా నాకు గుడిచ్చారంటే నేను బ్యామ్మణ్ణి అవడం వల్లే కదండీ” రాబోయే చిత్రం “జయమ్మ
పంచాయితీ” లో డైలాగ్ ఇది..ఆ వ్రాసిన మాహానుభావుడి సమ సమాజ సౌభ్రాతృత్వ ధోరణికి జోహార్లు.
ఆంగ్లేయుల పాలన పుణ్యమా అని వృత్తులన్నీ కులాల క్రింద మారిపోయాయి. సరే.. బ్రాహ్మణులు గుళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నారనుకుందాం. ఎంత ధనవంతులైనా సరే పబ్లిగ్గా, నిర్లజ్జగా కులాలను బట్టి రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళు, కోట్లకు పడగలెత్తి కూడా మైనారిటీ పేరుతో దోచుకుతింటున్న వాళ్ళు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాట్లాడడానికి చాలా ఉన్నాయి.
ఇంతా చేసి ఒక ఆలయంలో అర్చకుడు పొందుతున్న జీతభత్యాలెంతో ఒక్కసారి తెలుసుకుంటే మంచిది. అక్కడ పెద్ద బోర్డు.. దక్షిణ హుండీలోనే వెయ్యాలి అని. పోనీ ఇలా అన్నందుకు ఒక్క బ్రాహ్మణుడైనా ఎదురు తిరిగాడా?
సూటిగా మాట్లాడితే గుడిలో అర్చకవృత్తి బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. ఎందుకంటే వేరే ఏ ఉపయోగమూ, ప్రభుత్వాలు బ్రాహ్మణులకు మిగల్చలేదు.. చదువుకుంటే జనరల్ కేటగిరీ అని అక్కడా వివక్ష. అదేమిటి మరి? బ్రాహ్మణులు,రెడ్లు,నాయుళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు.. వాళ్ళకు తక్కువ మార్కులొచ్చినా ఒప్పుకోవాలి అనా? లేదా అగ్రవర్ణాలంటే చాలా అద్భుతాలు చేస్తేనే ప్రయోజనాలు చేకూర్చాలనా?
ఎదవలకు అధికారం అప్పచెప్తారు.. ఎదవలను కులసంఘాల నాయకులుగా చేసి, కులాల మధ్య వివక్ష పెంచుతారు..ఎదవలకు ఉచిత పథకాలిచ్చి ఇంకా ఎదవల్ని చేస్తారు..
ఒక్క గుడిలో పూజ చేసేవాడు మాత్రమే ఎదవన్నట్టు చిత్రీకరిస్తారు. వాహ్!!
పోనీ బ్రాహ్మణులమంతా మూకుమ్మడిగా అందరికీ గర్భాలయాన్ని అప్పజెప్తాం.. అంతే నిష్ఠగా తపస్సు ఆచరించి, అన్ని ఉపచారాలూ చేస్తారా? ఒక్కడూ రాడు.. దేవుడే లేదని చార్వాకసిద్ధాంతాలు వల్లెవేస్తారప్పుడు. అసలు చాలాచోట్ల సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణులు కానివారే అర్చకులుగా ఉండడం, దానిని బ్రాహ్మణులే సమర్థించడం మనకు తెలియదా?
దేవుడి మీద నమ్మకముంటే ఆ దేవుణ్ణే నమ్ముకుని బ్రతుకుతున్న బ్రాహ్మణులని గౌరవించాలి. నమ్మకం లేనప్పుడు అది మనకు సంబంధమే లేని విషయమని మన పని మనం చేసుకోవాలి. మధ్యలో ఏడ్చేవాడు ఎప్పుడూ ఏడు లోకాల క్రిందే ఉంటాడు.
PS: ఇది సినిమా మీదనో, సినీ రంగం మీదనో విమర్శ కాదు.. ఇలాంటి భావజాలం ఉన్న ప్రతి ఒక్కరిమీదా.
( ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే)