Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరిన పోసాని సోదరుడి కొడుకు

నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని పోసాని అన్నారు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. చంద్రబాబు ఆశయాలు నచ్చాయని అందుకే టీడీపీలో చేరినట్లు ఆయన వివరించారు. టీడీపీలో చేరిక తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

LEAVE A RESPONSE