– పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య ఉన్న సందిగ్ధతను తొలగించిన ఎన్నికల కమిషన్
ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై 20వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు జారి చేశారు.
ఎన్నికల విధులకు కేటాయింప బడిన ఉద్యోగులందరూ వారి వారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషణ్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం-12 పూర్తీ చేసి సమర్పిస్తే, తదుపరి వారికి ఫెలిసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇప్పటివరకు కొంతమంది అధికారుల మధ్య ఉన్న ప్రధానమైన సందిగ్ధత అంటే “ఉద్యోగులు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో వారి వారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషణ్ సెంటర్ నందు ఓటు వేసేలా సౌకర్యం కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ.
ఈ నెల 26 వ తేదీ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు చివరి తేదీ కాగా, మే మొదటి వారంలో వారి వారి పోస్టల్ బ్యాలెట్ ఓటును ఫెసిలిటేషన్ సెంటర్ లో వినియోగించుకునే అవకాశం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని *ఎన్నికల విధులకు హాజరయ్యె సిబ్బంది ఎవ్వరూ వారి ఓటుహక్కును వృదాచేసుకోకుండా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి