Suryaa.co.in

Andhra Pradesh

సీఎం ఫ్యామిలీ జోలికొస్తే ఖబర్దార్‌

-నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి 
-లేకపోతే మీకు బడిత పూజలు తప్పవు
-తెలుగుదేశం నాయకులకు సునీత హెచ్చరిక
-భారతమ్మ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
-ఆమెకు, రుషికొండకు ఏమిటి సంబంధం?
-ఇలాగే మాట్లాడితే గట్టిగా బుద్ధి చెబుతాం
-టీడీపీ మహిళా నేతలకు సునీత స్పష్టీకరణ
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత

చంద్రబాబునాయుడుకు ఒక సవాల్‌. కేవలం 2 ఎకరాల భూమి నుంచి ఏకంగా లక్షల కోట్లకు ఎలా ఎదిగారు? మీ అధికారం కోసం, మీ సీటు కోసం, సంపాదన కోసం ఎన్ని అరాచకాలు చేశారు? ఎన్ని హత్యలు చేశారు? రాష్ట్రాన్ని బలి చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలిసింది కాబట్టే, 2019 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పారు. మీ దుర్మార్గ, దుష్ట పాలనకు చరమగీతం పాడారు.కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ చంద్రబాబునాయుడు, నారా లోకేష్, ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లతో జగన్‌గారిని గెలిపించారు. ఈ మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పాలన పూర్తి పారదర్శకంగా కొనసాగుతోంది. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు అవుతున్నాయి. రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా వివిధ పథకాల ద్వారా నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.

ఓర్చుకోలేక..ఒణుకు పుట్టి:
75 ఏళ్ల స్వతంత్య్ర భారతంతో బీసీలకు గతంలో ఏనాడూ లేని విధంగా ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతోంది. సీఎం ఒక సామాజిక విప్లవకారుడిగా పని చేస్తున్నారు. దీన్ని చూసి ఓర్చుకోలేక భయంతో, వెన్నులో ఒణుకు పుట్టి, రెచ్చగొట్టే తెలుగుదేశం నాయకులతో పాటు, చంద్రబాబు మాట్లాడుతున్నారు.

బడిత పూజ తప్పదు:
మీకు రాష్ట్ర ప్రజలంటే కనీసం గౌరవం లేదు. సైకో అయ్యన్నపాత్రుడు.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నీవసలు బీసీ నాయకుడివా? కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. సీఎంగారిని పట్టుకుని పిల్లి, ఎలుక అని సంబోధిస్తావా? నీవు ఇలాగే మాట్లాడితే, రాష్ట్ర మహిళలంతా మీకు బడిత పూజ చేస్తారు.

బుద్ధి చెప్పి తీరుతారు:
ఇంకా అనిత నీవేం మాట్లాడుతున్నావు. ఎప్పుడూ మహిళలను అడ్డం పెట్టుకుని మాట్లాడడమేనా? అదేనా మీకు చంద్రబాబు నేర్పించారు?
ఎందుకు ప్రతిసారి మీరు భారతమ్మ పేరు ప్రస్తావిస్తున్నారు? ఆమెకు రుషికొండకు ఏమిటి సంబంధం? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఇవాళ విశాఖ ప్రజల డిమాండ్‌. వారు పరిపాలన రాజధాని కావాలంటున్నారు. దాంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విశాఖలో ప్రభుత్వానికి అవసరమైన భవనాలు కడుతున్నారు. అనితా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడితే ప్రజలు మళ్లీ తగిన బుద్ధి చెబుతారు.

మీకు ఓటమి తప్పదు:
2019 ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా మీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే, 2024లో కూడా మళ్లీ మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సమ్మేళనం నిర్వహిస్తే, చూసి తట్టుకోలేని మీరు బీసీల గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. చివరకు బీసీ నాయకుడైన యనమల రామకృష్ణుడు కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఇన్నాళ్లు మంత్రిగా ఎలా పని చేశాడన్నది కూడా అర్ధం కావడం లేదు.

బాబు కపట ప్రేమ గుర్తించండి:
విశాఖలో పరిపాలన రాజధాని కావాలని స్థానికులు కోరుతున్నారు. అందుకే ఎవరేం మాట్లాడినా, అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు అయి తీరుతుంది. రైతుల పేరుతో అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర బోగస్‌ అని తేలింది. చంద్రబాబుకు ఎంతసేపూ అమరావతిలో భూముల ధరలు పెరగాలి. అందుకే అన్నీ అక్కడే కావాలంటున్నాడు. నిజానికి ఆయనకు ఆ ప్రాంతం మీద, అక్కడి వారి మీద అభిమానం ఉంటే, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే, కోర్టు ద్వారా ఎందుకు అడ్డుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబుది మొత్తం కపట ప్రేమ. కాబట్టి అమరావతి రైతులు చంద్రబాబు ముసుగు రాజకీయాలు గుర్తించాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.

బీసీలకు సామాజిక న్యాయం:
బీసీలకు సీఎం వైయస్‌ జగన్, అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇచ్చారు. వారికి పూర్తి సామాజిక న్యాయం చేశారు. బీసీల్లో 12 మందికి ఎమ్మెల్సీ పదవులు, 4 గురికి రాజ్యసభ పదవులు, 6గురికి ఎంపీ పదవులు, 11 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. 136 బీసీ కులాలు ఉంటే, వారి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 674 డైరెర్టర్‌ పదవులు ఇచ్చారు. మా ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే, ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వారికి కళ్లు కనిపించడం లేదా? ఇకనైనా వారు వాస్తవాలు గుర్తించాలి.

మహిళలకు పెద్దపీట:
ఇంకా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కూడా సీఎం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వివిధ పథకాల్లో బీసీలకు తగిన ప్రయోజనం కల్పించారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేయూత పథకంలో దాదాపు 15 లక్షల బీసీ మహిళలకు ప్రయోజనం కల్పించారు. ఇంకా 30 లక్షలకు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇంత సుపరిపాలన చేస్తున్న జగన్‌ ని చూసి, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారు వాస్తవాలు గుర్తించి, తమ వైఖరి మార్చుకోవాలి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, 2024 ఎన్నికల్లో కూడా మా పార్టీని తిరిగి గెలిపిస్తారు.

దమ్ముంటే చర్చకు రండి:
చంద్రబాబుకు ఒక సవాల్‌. బీసీలకు మీరేం చేశారు? ఈ మూడేళ్లలో మేమేం చేశాం? అన్నదానిపై ఒక వేదికపై చర్చకు రావాలి. అక్కడే తేల్చుకుందాం. మీకు అంత ధైర్యం ఉందా? మరోసారి టీడీపీ నాయకులకు స్పష్టం చేస్తున్నాం. ఇంకోసారి మా భారతమ్మ పేరు ఉచ్చరిస్తే, మీకు బడిత పూజ తప్పదని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE