హైదరాబాద్:అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతేకాదు రూ.1800 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ బాహుబలి 2’ రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఇకపోతే ఇక్కడి వరకు అంతా బాగున్నా.. తాజాగా అల్లు అర్జున్. మరొకసారి కాస్త తల పొగరుగా ప్రవర్తించి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. ఇక ఇందులో జగపతి బాబు, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి భారీ తారాగణం భాగమైంది.
దీనికి తోడు జాతర సీక్వెన్స్ ఈ సినిమాకి ప్లస్ గా మారిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్ట డానికి కారణం కూడా ఈ సన్నివేశం అని చాలామంది సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.
దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోన్న అల్లు అర్జున్, క్షణికావేశంలో చేస్తున్న పనులు ఇతరులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయనను మళ్ళీ వివాదంలోకి నెట్టే స్తున్నాయని,చెప్పవచ్చు. ప్రస్తుతం బాహుబలి2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
అల్లు అర్జున్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
అయితే ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్ ను పెట్టి, ఒక రీల్ చేశారు అందులో బాహుబలిని ఎగిరి తన్నినట్టుగా ఆ మీమ్ ఉంది. అలాంటి మీమ్ ను అల్లు అర్జున్ ఇప్పుడు లైక్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు.
అప్పుడున్న రేట్లు ఏంటి? ఇప్పుడున్న రేట్లు ఏంటి? అయినా ఆ రికార్డును లేపేందుకు మీకు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? అంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఇలాంటివి కొన్ని తగ్గించుకుంటేనే మంచిది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.