– సానా సతీష్ బాబు కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి
కాకినాడ: ప్రజా సమస్యలు పరిష్కరించి దిశగా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు. శుక్రవారం జరిగిన 33వ వారం ప్రజాదర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రీయింబర్స్మెంట్, పింఛన్లు, తల్లికి వందనం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు.
ఈ సందర్భంగా కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ.. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు . వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి, పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలోని సమస్యలను రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు రాజ్యసభలో చర్చిస్తుండడంతో జిల్లావాసులు హర్షన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారం మొత్తం 20 అర్జీలు వచ్చినట్లు, అందులో 7 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జి, హరి, కొండబాబు, కామెడీ దశరథ్ డిఆర్య్సిసి సభ్యులు ముత్యాల అనిల్, ఐటిడిపి పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు.