Suryaa.co.in

Andhra Pradesh

పరిపాలన అంటే..చందాలు వసూలు చేయడం అనుకుంటున్నావా అమర్నాథ్?

పరిపాలన అంటే.. నల్ల క్వారీలు వద్ద నెలవారి చందాలు వసూలు చేయడం అనుకుంటున్నావా గుడివాడ అమర్నాథ్?
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్

పరిపాలన అంటే జగన్ రెడ్డి కాళ్లకు మొక్కి తెచ్చుకునే మంత్రి పదవి అనుకున్నావా? గుడివాడ అమర్నాథ్. కొత్తగా మంత్రి పదవి వచ్చేసరికి కొత్త బిచ్చగాడి వలె వాస్తవాలను మరిచి ఊహాలోకంలో గడుపుతున్నావు. నల్ల క్వారీలు వద్ద నెలవారి చందాలు వసూలు చేయడం అనుకుంటున్నావా పరిపాలన అంటే. నీ నియోజకవర్గంలోనే తుంపాల చక్కెర కర్మాగారాన్ని ఆదుకుంటానని వారిని రోడ్డున పడేసిన దిక్కులేని చరిత్ర మీది. నియోజక వర్గం లోని ప్రజలకు న్యాయం చేయలేని నీవు రాష్ట్ర ప్రజలకు మంత్రిగా ఏం పీకుతావ్? చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిస్థాయిలో అందిస్తానని ఇచ్చి నిలువునా విద్యార్థులను మోసం చేశాడు.

నవరత్నాలు అని ప్రజలకు ఊదరగొట్టి అమ్మ ఒడిని అర్థ ఒడిని చేశాడు. చంద్రన్న బీమా, అన్న క్యాంటిన్లు పేదవాడి బతుకుకు భరోసా ఇచ్చాయి. నవరత్నాలు అంటూ నవ మోసాలు చేసి బాదుడే బాదుడుతో పేదవాడి బతుకును ఛిద్రం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు సామాన్యుడు ప్రశాంతంగా బ్రతికే అవకాశం ఉందా? లక్షలాది మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన దూరంచేసి వారి జీవితాలకు చదువు పూర్తి చేసినా సర్టిఫికెట్లు రాకుండా శాపంగా మిగిల్చాడు.

తెలుగుదేశం పార్టీ భిక్షతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నీకు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి లేదు. చంద్రబాబు గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం, నల్ల క్వారీల దందాలతో, దగా చేసి బ్రతుకుతున్న నీ జీవితం ఓ నల్ల మరక. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు.ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే మరలా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం చారిత్రిక అవసరం.

దివాలాకోరు దిగజారుడు వ్యాఖ్యలు చంద్రబాబు గారి పై చేయడం మానుకోకుంటే తగిన శాస్తి చెబుతాం.అమలు చేయలేని ఉచిత హామీలు ఇచ్చి రాష్ట్రానికి ఉపద్రవం తెచ్చిన నయవంచకుడు జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కారణమైన ప్రజల జీవితాన్ని చీకటిమయం చేసిన వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు

LEAVE A RESPONSE