కాటికి కాలు చాపిన వయసులో విజయసాయిరెడ్డి వింత ప్రవర్తన చూసి విశాఖ ప్రజలు సిగ్గు పడుతున్నారు:ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్
విశాఖకు దాపురించిన పెనుప్రమాదం విజయసాయిరెడ్డి.విశాఖలో విజయసాయి రెడ్డి భూ దాహానికి అంతులేకుండా పోతోంది.వివేకా హత్య తరువాత గుండెపోటుతో చనిపోయారని ప్రకటన చేసిన విజయసాయిరెడ్డి పై మరింత లోతుగా సీబీఐ దర్యాప్తు జరిపించాలి.శంకర్ దాదా చార్టెడ్ అకౌంటెంట్ దొంగ లెక్కలతో ప్రభుత్వాన్ని మభ్యపెట్టాలని చూసి జైలుకెళ్లి వచ్చాడు.జైలుకు వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి నీతులు చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.2024లో A1,A2 ముద్దాయిలిద్దరు జైలుకెళ్లడం ఖాయం.ఎన్నికలలో గెలవడానికి అడ్డమైన దారులన్నీ తొక్కి ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని కాకి గోల చేస్తున్నాడు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డి విశాఖలో కబ్జా చేసిన భూములన్నీ స్వాధీనం చేసుకుని చిప్పకూడు తినిపిస్తాం.వైసిపి నాయకులు మాట్లాడే బూతులు ప్రజలు అసహ్యించుకుంటున్నా , విజయ సాయికి వేదమంత్రాలు గా వినిపిస్తున్నాయి.మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వైసీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం.