లోకేష్ భాష గురించి విజయసాయి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే!

సూట్ కేసు కంపెనీలు, దొంగలెక్కలతో బ్యాంకులకు కన్నాలువేసే చరిత్ర నీది!
మా నేతలకు మీతో టచ్ లో ఉండటం కాదు….త్వరలో సిబిఐ మీకు టచ్ లోకి వస్తుంది
తన శాఖ ఏదో తెలియని హవాలా మంత్రి కూడా లోకేష్ ను విమర్శించడమా?
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సరైన భాష మాట్లాడటం లేదంటూ ఎంపి విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. దేశంలో బూతులకు కేరాఫ్ అడ్రగ్ గా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసిపి మాత్రమే. రాజకీయాల్లో లోకేష్ అర్హతగల గురించి మాట్లాడేటపుడు ముందు నీ అర్హత ఏమిటో తెలుసుకుంటే మంచిది. 11 సిబిఐ, 7ఎన్ ఫోర్స్ మెంట్ కేసుల్లో ఉండి బెయిల్ పై తిరుగుతున్న ఎ1,ఎ2లకు అసలు పోటీచేసే అర్హత ఉందా? టిడిపి నేతలు తమతో టచ్ లో ఉన్నారని విజయసాయి మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే ఇప్పటికే సిబిఐ, ఈడి కేసుల్లో రోజువారీ విచారణ ఆరంభమైంది. త్వరలో ఎ1, ఎ2లకు సిబిఐ పోలీసులు టచ్ లోకి రాబోతున్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు విస్సారెడ్డి డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు.
తన శాఖ ఏమిటో, అందులో ఏంజరుగుతుందో తెలియని హవాలామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుప్పంలో చంద్రబాబు, లోకేష్ ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. బాబాయ్ హత్యకేసు బట్టబయలై రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పుకోలేక దొంగకు తేలుకుట్టినట్లుగా లోలోపల మదనపడుతున్నదెవరో అందరికీ తెలుసు. నీలాంటి చంచాలు వందమంది వచ్చినా కుప్పంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరు. చంద్రబాబుగారి రాజకీయ జీవితం ముగిసినట్లేనని అవాకులు,చవాకులు పేలుతున్నారు.
జగన్ రెడ్డి తాత రాజారెడ్డి హయాం నుంచి చంద్రబాబు గారు రాజకీయాల్లోనే ఉన్నారు, జగన్ రెడ్డి మనువడు వచ్చేవరకు కూడా ఆయన ఈ రాష్ట్రప్రజలకు సేవలందిస్తూనే ఉంటారు. 151సీట్లతో రాష్ట్రప్రజలు అధికారమిస్తే పరిపాలన చేతగాక రెండున్నరేళ్లకే రాష్ట్ర ఖజానాను దివాలా తీయించిన జగన్ కు, కనీసం రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో అయిదేళ్లపాటు పరుగులు తీయించిన చంద్రబాబుకు ఏమాత్రం పొంతన లేదు. రాష్ట్రప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఇక మీ మాయలో పడేందుకు జనం సిద్ధంగా లేరని తెలుసుకుని వైసిపి నాయకులు సర్దుకుంటే మంచిది. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయ సాధించబోతోందన్న సంకేతాలతో విజయసాయి, బాలినేని మతిభ్రమించి మాట్లాడుతున్నారు, ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ ఎన్నికల్లో టిడిపి విజయాన్ని అడ్డుకోలేరు.