Suryaa.co.in

Features Food & Health

త్రివిధ ప్రాణాయామాలు

ప్రాణవంతుడు కావటానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తులో ఎన్నో పద్ధతులు విశదీకరింపబడ్డాయి. మనకు తెలిసినంతవరకు ప్రాణాయామానికి 84 పద్ధతులు ఉన్నాయి. తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. కల్పసాధనకు పటిష్టమైన, ప్రమాదం లేని మూడు పద్ధతులు మాత్రం తీసుకోబడ్డాయి. సాధకుని పూర్తిగా అధ్యయనం చేసి, ఆతనికి తగినట్లుగా నెల రోజులు అభ్యాసం చేయడానికి ఒక రకం ప్రాణాయామం తెలపబడుతుంది.

నాడీశోధన ప్రాణాయామం: ఆయుర్వేదం యొక్క ఐదు రకాల చికిత్స వంటిది. శరీరంలోని వివిధ ప్రదేశాలలో మలినాలను విసర్జింప చేయడానికి వమన, విరేచన, స్వేదన, స్నేహన, వస్తి కర్మములు ఆచరింపబడుతాయి. ఆ తరువాతనే శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తాయి. సూక్ష్మ శరీరంలోని నాడీ శోధన ప్రాణాయామము ఈ పని చేస్తుంది. ఆయుర్వేదంలోని ఐదు ప్రక్రియలలో ప్రత్యక్షంగా మలినాలు విసర్జించబడ్డట్టు, సూక్ష్మ శరీరంలోని మలినాలు నాడీ శోధన ప్రాణాయామం ద్వారా శవాసనంలో విసర్జింపబడతాయి.

ప్రాణాకర్షణ ప్రాణాయామం లో, విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తిని సాధకుడు ఆకర్షించుకుంటాడు. మన వాతావరణం ఉదజని, ఆమ్లజని, నత్రజని మొదలైన మూలకాలతో కూడి ఉన్నట్లు, ప్రాణం కూడా వివిధ రకాలతో వివిధ కార్యాలకు ఉపయోగపడుతుంది. తనకు తగిన ప్రాణాన్ని తగినంతగా, తగు అవయానికి, సాధకుడు ఆకర్షించుకోగలుగుతాడు.

సూర్యభేదన ప్రాణాయామం: కాంతి పుట్టిన చోటును ఛేదించటం. ఈ సౌర కుటుంబానికి సూర్యుడు జీవన ప్రదాత. అతడు సజీవమైన, శక్తివంతమైన, మెలకువ గల శక్తి కేంద్రం. సాధకుడు ఈ కేంద్రాన్ని భేదించడం వల్ల సవితా శక్తి తోటి కలయికతో సవితా శక్తులను పొందగలుగుతాడు.
సంజీవని – ది వైబ్రెంట్ లైఫ్

– కల్పసాధన – పండిత శ్రీరామశర్మ ఆచార్య

LEAVE A RESPONSE