Suryaa.co.in

Telangana

టిఆర్ఎస్ ని లేకుండా చేయడం నీ తాత తరం, నీ బుడ్డర్ఖాన్ రేవంత్ తరం కాదు

– రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారు
– నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సంధర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: టిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లోపు లేకుండా చేయడం నీ తాత తరం, నీ బుడ్డర్కాన్ ముఖ్యమంత్రి తరం కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఇంత నీచంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల చేత ఇన్ని తిట్లు తిని ఉండలేదు. నికార్సైన సైనికుల లాంటి కార్యకర్తలు కేవలం టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు మాత్రమే ఉన్నారని అన్నారు.

అధికారంలో లేకపోయినా ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా వేల మంది కార్యకర్తలు దీక్షా దివస్ కి రావడం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ. రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడడానికి మా కార్యకర్తలే నిదర్శనం. పది రోజుల ముందే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ముందే ప్రకటించినప్పటికీ పోటీగా జిల్లాల్లో మంత్రుల పర్యటనలు పెట్టి రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ దీక్ష ఫలితాలే నేడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలు అనుభవిస్తున్నారు.

తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ త్యాగధనుడు కేసీఆర్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్నది. గుండెల నిండా తెలంగాణ మీద ప్రేమ ఉన్నవాళ్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001 ఒక్కడిగా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ వెంట కోట్లాదిమంది ప్రజలు నడిచారు. తెలంగాణ రాష్ట్రం కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించి, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తమకు మనుగడ లేదనే పరిస్థితులను సృష్టించి అన్ని పార్టీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకునేలా కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు.

మాట తప్పిన కాంగ్రెస్ పార్టీతో తెగ తెంపులు చేసుకొని కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి పదవులను గడ్డిపోచల మాదిరి విసిరేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. ఒక ప్రాంతం కోసం ప్రజల కోసం కేంద్ర మంత్రి పదవికి దేశంలోనే ఎవ్వరు రాజీనామా చేయలేదు. కేసీఆర్ ఒక్కరే ఆ సాహసాన్ని చేసిన త్యాగి. ఇస్తామని ఒప్పుకున్న తెలంగాణను ఇవ్వనందుకు ఇంకా చివరి అస్త్రంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కెసిఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కెసిఆర్ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

ముందుగానే తాను నవంబర్ 29 దీక్ష చేస్తానని ప్రకటించారు. పోలీసు నిర్బంధంతో కేసిఆర్ దీక్షను ఆపేందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కేసీఆర్ ను చంపేందుకు కుట్రలు జరిగినాయి. అయినప్పటికీ జైల్లోనే నిరాహార దీక్షను చేపట్టి తెలంగాణ రాష్ట్రం ప్రాణాలను పణంగా పెట్టారు. కెసిఆర్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేసిన నిరాహార దీక్షను కొనసాగించారు. నేను లేకున్నా మీరు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రజలకు కేసీఆర్ ఒక లేఖను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యమం చెలరేగింది విద్యార్థులు ఉద్యోగులు జర్నలిస్టులు సబ్బండవర్ణాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. కాంగ్రెస్ అధిష్టానానికి భయం పట్టుకున్నది. చివరికి పరిస్థితి విషమించడంతో తప్పని పరిస్థితుల్లో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చేత ప్రకటింప జేశారు.

దీనికి మూలమే నవంబర్ 29 నాడు కెసిఆర్ మొదలుపెట్టిన దీక్ష దివస్. దానికి గుర్తుగానే నేడు దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎట్లా అయితే సీమాంధ్ర చేతుల్లో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయాలని కెసిఆర్ 29 నంబర్ నాడు దీక్ష చేశారో… ఈరోజు మనమందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో సర్వనాశనం చేశారు. రైతు భరోసా లేదు. పెన్షన్ సరిగా జరగడం లేదు. రుణమాఫీ జరగలేదు. ధాన్యం కొనుగోలు సరిగా జరగలేదు. తెలంగాణను తలకిందులు చేశారు.

2027లో జమిలి ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రజల్లో మళ్ళీ మళ్లీ కేసిఆర్ రావాలని కోరుకుంటున్నారు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే అన్ని సరిదిద్దు కుంటాం. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు రాబోయే రోజుల్లో బాధ్యతలు తీసుకోవాలి. ప్రజలు మనకు అండగా ఉన్నారు. మదమెక్కి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల భరతం పట్టాలి. మేము ముందుంటాం. మాకు సహకరించండి. పోలీస్ కేసులు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఈనాడు కొత్తవి కావు.

ఉద్యమ కాలంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం. ఏ కార్యకర్తకు కష్టం వచ్చిన పార్టీ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది. ఒక్క పిలుపుతో వందల కార్లలో వేలమంది తరలివచ్చారు. ఇంకా నాలుగు మంత్రి పదవులు వచ్చిన కార్యకర్తల ముందు ప్రేమాభిమానాల ముందు తక్కువే. సొంత డబ్బులతో ఖర్చుపెట్టుకొని పార్టీ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ ఇదే స్పూర్తితో కొనసాగాలని కోరుకుంటున్నాను.

LEAVE A RESPONSE