– నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశం
గుంటూరు: పశ్చిమ నియోజక వర్గ అభివృద్ధి ప్రణాళికల పై ఎమ్మెల్యే సుజన చౌదరి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య నికి సంబంధించిన ప్రణాళికలు అధికారులను అడిగి తెలుసు కున్నారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల పురోగతి, నీ అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్ సీ ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయాలను ఆరా తీశారు. ఈనెల 20 వ తేదీన జిల్లా కలెక్టర్ తో కలిసి మరో సారి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటి లోగా అభివృద్ధి ప్రణాళికల స్టేటస్ తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమం లో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, కార్పొరేషన్ డీఈ సుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ డెవలప్మెంట్ నోడల్ ఆఫీసర్ మధు, విద్యుత్ శాఖ , కార్పొరేషన్ వైద్య ఆరోగ్య విభాగం అధికారుల తో పాటు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.